ఆంధ్రప్రదేశ్‌

విశాఖ మెడ్‌టెక్ జోన్ బోర్డు పునర్ వ్యవస్థీకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 14: విశాఖ మెడ్‌టెక్ జోన్ పాలక వర్గాన్ని రాష్ట్ర ప్రభుత్వం పునర్‌వ్యవస్థీకరించింది. చైర్మన్, 11 మంది డైరెక్టర్లతో కొత్త పాలక వర్గాన్ని నియమిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేస్తూ కొత్త పాలక వర్గాన్ని నియమించింది. మెడ్‌టెక్ జోన్‌కు చైర్మన్‌గా వైద్య, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కె.ఎస్.జవహర్‌రెడ్డిని నియమించింది. డైరెక్టర్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ శాఖల అధికారులు 11 మందిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈపీడీసీఎల్‌కు రూ.37.68 కోట్లు మంజూరు
హుదూద్ తుపాను వల్ల కోస్తా జిల్లాల్లో ఏపీఈపీడీసీఎల్‌కు భారీ నష్టం సంభవించింది. ఆ పరిస్థితుల నుంచి విద్యుత్ సరఫరాను సాధారణ పరిస్థితి వచ్చేందుకు వీలుగా ప్రపంచ బ్యాంక్ 126.32 కోట్లు మంజారు చేసింది. ఇందులో 68 శాతం మొత్తం 86.82 కోట్ల రూపాయలు ఇప్పటికే మంజూరు చేసింది. ఆ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏపీఈపీడీసీఎల్‌కు విడుదల చేసింది. కాగా వివిధ పద్దుల కింద 3.8 కోట్ల రూపాయలు మినహాయించుకోగా, మిగిలిన మొత్తాన్ని విడుదల చేయాలని ఈపీడీసీఎల్ కోరటంతో ఈ మేరకు 37.68 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ-వేస్ట్ నిర్వహణకు
నోడల్ అధికారుల నియామకం
జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఈ-వేస్ట్ నిర్వహణకు వివిధ స్థాయిల్లో నోడల్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. రాష్ట్ర స్థాయిలో అటవీ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, జిల్లా స్థాయిలో ఆయా జిల్లాల కలెక్టర్లు, నగర పాలక సంస్థలు, మున్సిపాలిటీల్లో కమిషనర్లు నోడల్ అధికారులుగా వ్యవహరిస్తారు.
జనాభా లెక్కల సేకరణకు సమన్వయ కమిటీ
జనాభా లెక్కల సేకరణ ప్రక్రియ సమర్థవంతంగా, వివిధ శాఖల సమన్వయంతో నిర్వహించేందుకు వీలుగా రాష్ట్ర స్థాయి సమన్వయ కమిటీని ప్రభుత్వం నియమించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్మన్‌గా వ్యవహరించే ఈ కమిటీలో సభ్యులుగా రెవెన్యూ, పాఠశాల విద్య, పంచాయతీరాజ్, ప్లానింగ్, పురపాలక, సాధారణ పరిపాలన విభాగాల అధికారులు వ్యవహరిస్తారు. మెంబర్ కన్వీనర్‌గా సెన్సస్ ఆపరేషన్స్ డైరెక్టర్ వ్యవహరిస్తారు.
స్వచ్ఛ్భారత్‌కు రూ.240 కోట్లు
స్వచ్ఛ్భారత్ మిషన్ గ్రామీణ్ కింద ప్రతిభ ఆధారంగా ఇచ్చే ప్రోత్సాహకాలను చెల్లించేందుకు 240 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది.
చెరువుల పూడికతీత ఉత్తర్వులకు సవరణలు
మైనర్ ఇరిగేషన్ చెరువుల పూడిక తీతకు సంబంధించి గతంలో జారీ చేసిన ఉత్తర్వులకు సవరణలు జారీ చేసింది. తీసిన పూడికను వాణిజ్య అవసరాలకు ఉపయోగిస్తే, ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకుంటారు. లక్ష రూపాయలు జరిమానా విధిస్తారు. వాణిజ్య అవసరాలకు సంబంధించి ప్రభుత్వం అనుమతి మంజూరు చేస్తే, నిబంధనల మేరకు సీనరేజ్‌ను చెల్లించాల్సి ఉంటుంది.