ఆంధ్రప్రదేశ్‌

ప్రమాదంలో దేశ ఆర్థిక వ్యవస్థ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, అక్టోబర్ 13 : దేశ ఆర్థిక వ్యవస్థ ప్రమాదకర పరిస్థితుల్లో ఉందని, వామపక్షాలు సూచించిన మార్గాలను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తేనే దేశంలో నెలకొన్న ఆర్థిక మాంద్యానికి పరిష్కారం లభిస్తుందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అన్నారు. ఆర్థిక మాంద్యాన్ని నివారించాలని కోరుతూ చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం ఒంగోలులో నిర్వహించిన ఆర్థిక సంక్షోభం -వివిధ వర్గాలపై ప్రభావం అనే అంశంపై సదస్సు జరిగింది. ఈ సదస్సులో రాఘవులు మాట్లాడుతూ దేశంలో ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోయిందన్నారు. అందుకే దేశంలో ఉత్పత్తి అయిన సరుకు అమ్ముడుపోవడం లేదన్నారు. దేశంలో ఆర్థిక మాంద్యం కారణంగా ఆటోమొబైల్ పరిశ్రమ దెబ్బతిందని, ఒక్క కారు కూడా అమ్ముడుపోవడం లేదన్నారు. ఆటోమొబైల్ పరిశ్రమ దెబ్బతినడంతో అనేక రంగాలు నిర్వీర్యం అవుతున్నాయని, దీంతో పది లక్షల మందికి ఉపాధి కోల్పోయారన్నారు. బిస్కెట్లు కూడా 50 శాతం అమ్మకాలు పడిపోయాయని అన్నారు. ప్రజల వద్ద కనీసం బిస్కెట్లు కూడా కొనుగోలు చేసేందుకు డబ్బులు లేని పరిస్థితులు నెలకొన్నాయన్నారు. వస్త్రాలు, ఆభరణా, సౌందర్య సాధనాల అమ్మకాలు తగ్గిపోయాయని తెలిపారు. 2014వ సంవత్సరంలో దేశంలో వందకు ఎనిమిది శాతం అభివృద్ధి ఉంటే అది ప్రస్తుతం ఐదు శాతానికి పడిపోయిందన్నారు. బ్యాంకుల్లో గత సంవత్సరం సెప్టెంబర్ నాటికి లక్షా 75 వేల కోట్ల రూపాయలు రుణం తీసుకుంటే ఇప్పుడు అది 90 వేల కోట్లకు పడిపోయిందన్నారు. బ్యాంకుల్లో రుణం తీసుకునేందుకు కూడా ఇబ్బందులు పడే పరిస్థితి ఉందన్నారు. నిరుద్యోగం పెరిగిందన్నారు. వ్యవసాయం సంక్షోభంలో ఉందని, ప్రమాదకర పరిస్థితుల్లో దేశ ఆర్థిక వ్యవస్థ ఉందని హెచ్చరించారు. ఆర్థిక మాంద్యం పరిష్కారానికి మోదీ ఒక్క చర్య కూడా తీసుకోలేదని విమర్శించారు. ఆర్థిక మాంద్యం గురించి మోదీ ప్రస్తావన కూడా చేయడం లేదని ధ్వజమెత్తారు. ఆర్థిక మాంద్యంపై కేంద్రం అర్ధం కానట్లు నటిస్తోందని దుయ్యబట్టారు. కార్పొరేట్ టాక్స్ 35 శాతం నుంచి 25 శాతానికి కుదించి లక్షా 45 వేల కోట్ల రూపాయల రాయితీలు మోదీ ఇచ్చారని విమర్శించారు. గిట్టుబాటు ధరలు లేక రైతులు అల్లాడిపోతుంటే పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఆర్థిక మాంద్యానికి పరిష్కారం, కార్పొరేట్లకు రాయితీలు, డబ్బులు ఇవ్వడం కాదని, ప్రజల కొనుగోలు శక్తిని పెంచాలన్నారు. ఆర్థిక మాంద్యం జబ్బును సృష్టించి వారికే మోదీ డబ్బులు ఇస్తున్నారు కాని జనాలకు ఇవ్వడం లేదని విమర్శించారు. వౌలిక సదుపాయాల కోసం నగదు ఖర్చు పెట్టాలన్నారు. విద్య కోసం ఆరు శాతం ఖర్చు పెట్టాలన్నారు. ఆరోగ్యానికి వందకు రెండు రూపాయలే ఖర్చు పెడుతున్నారని, ఈ రెండు రూపాయలు కూడా పెట్టుబడిదారులకే పోతుందన్నారు. వైద్య రంగానికి అధిక డబ్బులు ఖర్చు పెట్టాలని సూచించారు. కార్మికులకు కనీస వేతనం రూ.21 వేలు ఇవ్వాలన్నారు. రైతులకు పెట్టుబడికి అయిన ఖర్చుతో పాటు పంటకు గిట్టుబాటు ధర కల్పించాలన్నారు. వ్యవసాయ సంక్షోభాన్ని పరిష్కారం చేయకుండా ఆర్థిక సంక్షోభం పరిష్కారం కాదన్నారు. ఇవన్నీ చేయాలని కేంద్రాన్ని వామపక్షాలు కోరుతున్నాయని డిమాండ్ చేశారు. మోదీ ప్రభుత్వం కనీస వేతనం రూ.178గా నిర్ణయించారని, ఈ నగదుతో ఏం సరుకులు వస్తాయో మోదీ చెప్పాలన్నారు. ఆర్థిక మాంద్యం గురించి మోదీ మాట్లాడకుండా ప్లాస్టిక్ వస్తువులు, కాశ్మీర్ అంశం, ట్రంప్‌ను గెలిపించాలని మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. అసలు సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారని దుయ్యబట్టారు. గతంలో అమెరికాలో ఆర్థిక మాంద్యం వచ్చినప్పుడు ఆ దేశ అధ్యక్షుడు రూజ్‌వెల్ట్ చేసిన పరిష్కార మార్గాన్ని మన దేశంలో మోదీ చేస్తే ప్రజలు కొంత ఉపశమనం పొందుతారని తెలిపారు.
*చిత్రం... ఒంగోలులో జరిగిన సదస్సులో మాట్లాడుతున్న సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు