ఆంధ్రప్రదేశ్‌

ప్రకాశం బ్యారేజీకి వరద తాకిడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 13: ప్రకాశం బ్యారేజీకి క్రమేణ వరద తాకిడి పెరుగుతున్నది. కృష్ణానది ఎగువ ప్రాజెక్టుల పలు గేట్ల ఎత్తివేతతో కృష్ణా జిల్లాలో నదీ పరివాహక ప్రాంతంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఆదివారం రాత్రి 60 వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదలుతూ కాలువలన్నింటికీ కల్పి 13,500 క్యూసెక్కుల నీటిని వదలుతున్నారు. ప్రకాశం జిల్లా గడచిన మూడు మాసాలుగా చుక్క నీటికి నోచుకోలేవడం లేదు. ఆ జిల్లాలోని రామతీర్ధం, గుండ్లకమ్మ తదితర ప్రాజెక్టులు వరద నీటికై ఎదురుచూస్తున్నాయి. రైతులకు సాగునీరు, ప్రజలకు మంచినీరు రాని ఈ ప్రాంతంలో మనుషులతో పాటు పాడికి నెలపైన పశువులకు సైతం నీటికి కరువయ్యాయి. శ్రీశైలం నుంచి పోతిరెడ్డి పాడు ద్వారా రాయలసీమకు నీరు ఇచ్చేస్తున్నామంటూ గతంలో చంద్రబాబు, నేడు జగన్ ఆర్భాటపు ప్రకటనలు చేస్తున్నారు కానీ శ్రీశైలం దిగువనున్న ప్రకాశం జిల్లా గురించి నోరు మెదపడం లేదని ఆ ప్రాంతానికి చెందిన బీజేపీ రాష్ట్ర నాయకుడు లంకా దినకర్ ఆంధ్రభూమి ప్రతినిధితో అన్నారు. వాస్తవానికి శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టుల సాక్షిగా ప్రకాశం జిల్లాపై ఎన్నో దశాబ్దాలుగా వివక్షణ కొనసాగుతున్నదని ఒకరో లేక ఇద్దరో నాయకులు అడపాదడపా మాట్లాడుతున్నా ఎవరు అధికారంలో ఉన్నా వారి మాటలు పాలకుల చెవికి ఎక్కడం లేదన్నారు.