ఆంధ్రప్రదేశ్‌

సాగర్ గేట్లు ఎత్తివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయపురిసౌత్: శ్రీశైలం జలాశయం నుండి సాగర్ జలాశయానికి ఆదివారం వరద ప్రవాహం పెరిగింది. దీంతో సాగర్ జలాశయం నుండి 10 క్రస్ట్‌గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 1,59,707 క్యూసెక్కుల నీటిని ప్రాజెక్టు అధికారులు విడుదల చేస్తున్నారు. సాగర్ జలాశయం నీటిమట్టం 590 అడుగులకు చేరుకుంది. ఇది 312.5087 టి ఎంసిలకు సమానం. సాగు, తాగునీటి అవసరాల నిమిత్తం సాగర్ జలాశయం నుండి కుడికాలువకు 9194, ఎడమ కాలువకు 8454, ప్రధాన జలవిద్యుత్ కేంద్రానికి 32548, ఎస్ ఎల్‌బిసికి 2400, మొత్తం అవుట్‌ఫ్లోగా 1,72,610 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం నుండి సాగర్ జలాశయానికి 1.80 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది.
శ్రీశైలం జలాశయం 884.80 అడుగుల వద్ద కొనసాగుతుంది. ఇది 214.8450 టి ఎంసిలకు సమానం. ఎగువ జలాశయాల నుండి శ్రీశైలానికి 1,26,328 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. శ్రీశైలం 4 క్రస్ట్‌గేట్లను ఎత్తి దిగువనున్న సాగర్ జలాశయానికి నీటిని విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు.
*చిత్రం... నాగార్జునసాగర్ నుండి విడుదలవుతున్న వరద నీరు