ఆంధ్రప్రదేశ్‌

గతం మర్చిపోతున్న చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, అక్టోబర్ 13: తన పాలనలో జరిగిన అకృత్యాలను మర్చిపోయి చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపై అభాండాలు మోపుతున్నారని మండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఆరోపించారు. విశాఖ వైసీపీ కార్యాలయంలో ఆదివారం విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలీసులను తన రాజకీయ ప్రత్యర్థులపైకి ఉసిగొల్పిన ఘన చరిత్ర నీదేనన్నారు. విశాఖ ఎయిర్‌పోర్టులో అప్పటి విపక్ష నేత జగన్‌పై హత్యాయత్నం జరిగితే డీజీపీ ప్రెస్‌మీట్ పెట్టి వాస్తవాలను తప్పుగా ప్రచారం చేయించలేదా? అని ప్రశ్నించారు. దెందులూరు శాసననభ్యుడు చింతమనేని ప్రభాకర్ ఒక మహిళా తహశీల్దారుపై అనుచితంగా ప్రవర్తిస్తే మధ్యవర్తిత్వం నెరపి రాజీ చేసింది జనం మర్చిపోలేదన్నారు.
తమ పార్టీ ఎమ్మెల్యేపై ఇవే ఆరోపణలు వస్తే కేసు నమోదు చేయించారని గుర్తు చేశారు. కాపు ఉద్యమ సమయంలో చోటుచేసుకున్న తుని ఘటనలో ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభాన్ని గృహ నిర్బంధం చేసి, వారి కుటుంబాన్ని పోలీసులతో మానసికంగా హింసించారని, ఇంతటి నీచమైన రాజకీయాలు చేసిన చంద్రబాబు వైసీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్‌పై ఎదురుదాడి చేయడం నీకే చెల్లిందన్నారు. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యకు నీ వైఖరే కారణమని ఆరోపించారు. ఓటమి తరువాత కనీసం కోడెలను పలుకరించిన పాపాన పోలేదని, చివరకు ఛలో ఆత్మకూరు కార్యక్రమానికి కూడా పిలవకుండా అవమానించి ఆయన ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించారని ఆరోపించారు.
ఓటమి అనంతరం చంద్రబాబు తీరు పూర్తిగా మారిపోయిందని, పదవి పోయిందన్న బాధలో ఆయన ఏం మాట్లాడుతున్నారో అర్ధం కావట్లేదన్నారు. ఓటమిపై విశే్లషణ చేసుకోకుండా, వైసీపీ ప్రభుత్వంపై నిందారోపణలతో కాలక్షేపం చేస్తున్నారన్నారు. బీజేపీని వీడి బయటకు రావడంవల్లే ఓటమి పాలయ్యామని, జనసేనవల్ల కాదని చంద్రబాబు చెప్పడం చూస్తే భవిష్యత్‌లో బీజేపీతో కలిసేందుకు మార్గాలు వెతుకుతున్నట్టేనన్నారు. గతంలో ఎన్‌టీఆర్ మద్యనిషేధాన్ని అమలుచేస్తే తాను అధికారంలోకి వచ్చిన వెంటనే ఎత్తివేశారని, జగన్ దశలవారీగా మద్య నిషేధం కోసం ముందుకు వెళ్తుంటే విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.
విద్యుత్ పీపీఏల విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయాలవల్ల రాష్ట్ర ప్రజలపై అదనపు భారం తగ్గుతుందన్నారు. వచ్చే 20 ఏళ్ల వరకూ ఇప్పటి ధరలే కొనసాగించడమంటే ప్రభుత్వాన్ని నిండా ముంచడమేనన్నారు.