ఆంధ్రప్రదేశ్‌

ప్రజల హక్కుల బాధ్యత జగన్‌దే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 13: ప్రజల హక్కులు కాపాడాల్సిన బాధ్యత సీఎం జగన్‌మోహన్‌రెడ్డిపై ఉందని అయితే ఆయన తెలంగాణా బాటలోనే ఏపీ ముఖ్యమంత్రి నడుస్తున్నారంటూ మాజీ మంత్రి దేవినేని ఉమా ధ్వజమెత్తారు. పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కృష్ణా గోదావరి జలాల వినియోగంపై విభజన చట్టం ప్రకారం ఎపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు జరిగిందని ఇందులో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి, తెలంగాణా, ఏపీ ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉంటారని అన్నారు. అయితే పార్లమెంట్ సాక్షిగా చేసిన చట్టాలన్నీ తెలుగు రాష్ట్రాల సీఎంలకు చుట్టాలయ్యాయంటూ ఎద్దేవా చేశారు. అసలు ఇరు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఏ విషయాలు చర్చించారో ప్రజలకు వివరణ ఇవ్వాల్సి ఉందన్నారు. కేంద్ర జలశక్తి శాఖ కోరిన ఎజెండా పంపడానికి ఎందుకు విముఖత అని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చి నాలుగు నెలల్లో పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఏం అడిగారు, పోలవరం కేసులు ఎత్తేస్తానని ఎన్నికల్లో చెప్పిన కేసీఆర్‌ను ఆ విషయం అడిగారా? అని అన్నారు. పోలవరం ఎత్తు తగ్గించడానికి వీరికి హక్కు ఎవరిచ్చారని అన్నారు. కృష్ణాజలాల వినియోగం విషయంలో రాజశేఖరరెడ్డి చేసిన తెలివితక్కువ నిర్ణయంతో ఇచ్చిన మెమో ముప్పుగా మారిందని ఉమా విమర్శించారు. ఐదు వేల కోట్ల విద్యుత్ బకాయిలు ఎందుకు జగన్‌మోహన్‌రెడ్డి అడగటం లేదన్నారు. విద్యుత్ ఉద్యోగులను ఏకపక్షంగా పంపేస్తే ఏం చేసారని అన్నారు. 2 లక్షల కోట్ల ఆస్తుల పంపకాలు జరగాల్సి ఉంటే జగన్‌మోహన్‌రెడ్డి ఎందుకు మాట్లాడటం లేదని, అసలు రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు నాలుగు సార్లు కలిశారు. కలిసి ఏం నిర్ణయించారని చెప్పాల్సి ఉందని ఉమా అన్నారు.