ఆంధ్రప్రదేశ్‌

అర్హులందరికీ రైతు భరోసా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ రూరల్, అక్టోబర్ 13: రాష్ట్రంలో అర్హులందరికీ రైతు భరోసా పథకాన్ని అందిస్తామని వ్యవసాయ, సహకార శాఖ మంత్రి కురసాల కన్నబాబు స్పష్టంచేశారు. కౌలు రైతులను ఆదుకోవాలనేది ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ముఖ్య ఉద్దేశ్యమన్నారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ఆదివారం ఆయన విలేఖర్లతో మాట్లాడారు. అక్టోబర్ 15 రాష్ట్రంలో రైతు సంక్షేమానికి ఒక చారిత్రాత్మక రోజు అవుతుందన్నారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి రైతు భరోసా పథకాన్ని ప్రారంభిస్తారన్నారు. ప్రధాన మంత్రి కిసాన్ యోజనతో కలిపి ఇచ్చేది వైఎస్‌ఆర్ భరోసా పథకమని, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా దాపరికంతో వ్యవహరించడం లేదని మంత్రి కన్నబాబు స్పష్టంచేశారు. కౌలు రైతులను ఆదుకోవడం ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రధాన లక్ష్యమని ఈ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. రైతు నమోదు ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని, అర్హతలేని కొందరి పేర్లు నమోదయినట్లు గుర్తించామన్నారు. అదేవిధంగా కొందరు రైతులు మృతి చెందినా వారి పేర్లు అర్హుల జాబితాలో ఉన్నాయని, వాటన్నింటినీ పరిశీలించిన అనంతరం వైఎస్‌ఆర్ రైతు భరోసా పధకాన్ని అందిస్తామని స్పష్టంచేశారు. జగన్మోహన్‌రెడ్డి పాదయాత్రలో రైతుల కష్టాలను తెలుసుకుని చలించిపోయారని, ఆ నేపథ్యంలో వారికిచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన రెండేళ్లకు ఇవ్వాల్సివున్నా ముందుగానే అమలుచేస్తున్నారని పేర్కొన్నారు. రైతు అంటే గుర్తుకు వచ్చేది దివంగత నేత రాజశేఖరరెడ్డి అని ఆయన రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తానంటే చంద్రబాబు హేళనగా మాట్లాడారని, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఉచిత విద్యుత్ హామీని అమలు చేసి చూపించారని కన్నబాబు గుర్తుచేశారు.

*చిత్రం... విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి కన్నబాబు