ఆంధ్రప్రదేశ్‌

రేపటి నుంచి పోలీసు అమరవీరుల స్మారకోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, అక్టోబర్ 13: పోలీసు అమరవీరుల స్మారక వారోత్సవాలు ఈ నెల 15వ తేదీ నుండి 21వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు. పోలీసు కమిషనరేట్ల నుంచి మండల స్థాయి పోలీసుస్టేషన్ల వరకు ఆయా స్థాయిల్లో పోలీసు సిబ్బంది చేసిన త్యాగాలను స్మరించుకోవడంతో పాటు ఆరోగ్యకరమైన పోలీసింగ్ వ్యవస్థను ప్రోత్సహించడంలో భాగంగా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని రాష్ట్ర డీజీపీ కార్యాలయం నుండి ఆదివారం ఈ మేరకు డీజీపీ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 15వ తేదీన విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో స్మారక వారోత్సవాలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఏడు రోజుల పాటు వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, ఇందులో భాగంగా తొలిరోజు పాఠశాలల పిల్లలకు పెయింటింగ్, కార్టూన్, వ్యాసరచన పోటీలు నిర్వహిస్తామని చెప్పారు. 16వ తేదీన పోలీసు కుటుంబాల్లోని పిల్లల కోసం యూనిట్ హెడ్ క్వార్టర్స్ ఎలోక్యూషన్, ఎస్‌ఎ రైటింగ్ పోటీలు నిర్వహించడంతో పాటు అన్ని యూనిట్లలో రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయాలని ఇప్పటికే ఆయా జిల్లాల పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశామని పేర్కొన్నారు.
17వ తేదీన మారాధాన్ నిర్వహించడంతో పాటు ఓపెన్ హౌస్, రక్తదానాలు నిర్వహిస్తామని, 4వ తేదీన విశాఖపట్నంలో రాష్టస్థ్రాయిలో మారధాన్ జరపడంతో పాటు ఆయా యూనిట్ ప్రధాన కార్యాలయాల్లో పోలీసులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై అభిప్రాయాలు, అంచనాలను ప్రతిబింభింపజేయడం అనే అంశంపై వర్క్‌షాప్ నిర్వహిస్తామన్నారు. 19న మెరుగైన లా అండ్ ఆర్డర్ నిర్వహణ కోసం పోలీసులతో చేతులు కలపాల్సిన అవసరంపై విద్యాసంస్థలు, కళాశాలలు, విశ్వ విద్యాలయాల్లో సదస్సులు నిర్వహించాలని ఆదేశించినట్లు తెలిపారు. 20వ తేదీన జిల్లా ప్రధాన కార్యాలయాల్లో ఆరోగ్య శిబిరాలు, అమరవీరుల కుటుంబాలతో సమావేశాలు, బహిరంగ ప్రదేశంలో సాంస్కృతిక కార్యక్రమాలు, సాయంత్రం వేళ కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. చివరిరోజైన 21వ తేదీన విజయవాడలో రాష్టస్థ్రాయి స్మారక పెరెడ్‌తో పాటు అన్ని జిల్లాల పోలీసు కవాతులు నిర్వహించడంతో స్మారక వారోత్సవాలు ముగుస్తాయని డీజీపీ సవాంగ్ పేర్కొన్నారు.