ఆంధ్రప్రదేశ్‌

కొలిక్కిరాని ‘రైతు భరోసా’ లబ్ధిదారులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 13: రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు ఉద్దేశించిన రైతు భరోసా పథకాన్ని ఈ నెల 15 నుంచి అమలు చేసేందుకు నిర్ణయించినప్పటికీ ఇంకా లబ్ధిదారుల సంఖ్య కొలిక్కిరాలేదు. ఈ నెల 11 నాటికే లబ్ధిదారుల జాబితా సిద్ధం చేయాలని భావించినా, అది ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. పథకం అమలు చేసేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం 5510 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. రైతు భరోసా పథకాన్ని కౌలు రైతుల సహా 64 లక్షల మందికి ఏటా 12,500 రూపాయల పెట్టుబడి సాయం అందించనున్నట్లు బడ్జెట్‌లో ప్రకటించింది. పథకం అమలుకు వీలుగా గత నెల 19న మార్గదర్శకాలు విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం కూడా కిసాన్ సమ్మాన్ పథకం కింద ఏటా రైతులకు 6 వేల రూపాయల మేర ఆర్థిక సాయం చేస్తోంది. ఆ మొత్తంతో కలిపి రైతులకు 12,500 రూపాయలను పెట్టుబడి సాయంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే సొంత భూమి కలిగిన రైతులకు మాత్రమే కేంద్ర ప్రభ్వుత్వం సాయం వర్తింప చేస్తోంది. ఇప్పటి వరకూ మూడు కిస్తీలను రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఎన్నికల ముందు విడుదల చేసిన మొదటి కిస్తీలో లబ్ధిదారుల సంఖ్య 42.54 లక్షల మంది కాగా, వివిధ వడబోతల అనంతరం రెండో కిస్తీ సమయానికి ఈ సంఖ్య 40.97 లక్షలకు పడిపోయింది. మూడో కిస్తీ కింద 29.75 లక్షల మందికి మాత్రమే కేంద్రం జమ చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 48.85 లక్షల మంది రైతుల ఖాతాలను పరిశీలించి అర్హులుగా
ఆమోదం తెలిపింది. ఐదు ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న రైతుల సంఖ్య 66.54 లక్షలు. రాష్ట్రంలో కౌలు రైతులు దాదాపు 16 లక్షల మంది ఉండగా, వారిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు చెందిన భూమి లేని కౌలు రైతులకే ఈ పథకం వర్తింప చేయనుంది. దీంతో వీరి సంఖ్య 2.5 లక్షలకే పరిమితం కానుంది. గత ప్రభుత్వ హయంలో కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వగా ప్రస్తుతం వాటిని పరిగణలోకి తీసుకోవడం లేదు. గ్రామ వలంటీర్లతో, వ్యవసాయ శాఖ సహాయకులతో కౌలు రైతుల వివరాలు సేకరిస్తున్నారు. కొత్త చట్టం ప్రకారం భూ యజమాని, కౌలు దారులు ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. అందుకు చాలా మంది భూ యజమానులు ముందుకు రావడం లేదు. రైతు భరోసా పథకం కింద అర్హులను గుర్తించేందుకు ప్రజా సాధికార సర్వే, ఆధార్‌తో రైతుల వివరాలను అనుసంధానం చేస్తున్నారు. దీంతో ఆ వివరాలు సరిపోలడం లేదు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసేందుకు ప్రాథమికంగా ఎంపిక చేసిన జాబితాల్లో 5 శాతం వివరాలను మండల, డివిజన్ స్థాయిలో పరిశీలించాల్సి ఉంటుంది. వెబ్‌ల్యాండ్‌లో వివరాల నమోదులో లోపాల వల్ల కూడా రైతుల వివరాల పరిశీలనలో జాప్యం జరుగుతోంది. ప్రాథమిక దశలోనే 30.3 లక్షల దరఖాస్తులను రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారులు తిరస్కరించారు.
కాగా, కేంద్రం దాదాపు 30 లక్షల మందికే 6 వేల రూపాయల చొప్పున సాయం అందిస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 51 లక్షల మందికి రైతు భరోసాను అమలు చేయనుంది. కేంద్రం అందిస్తున్న సాయం అనుసంధానం చేస్తూ 30 లక్షల మందికి మిగిలిన 6500 రూపాయలను రైతుల ఖాతాలో జమ చేయనుంది. మిగిలిన 21 లక్షల మందికి రాష్ట్ర ప్రభుత్వమే 12,500 రూపాయల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. రైతులకు చెల్లింపులు చేసేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం 5510 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం విశేషం.