ఆంధ్రప్రదేశ్‌

మాజీ ఎమ్మెల్యే వాసిరెడ్డి కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, అక్టోబర్ 13: జిల్లాలోని సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వాసిరెడ్డి వరద రామారావు ఆదివారం సాయంత్రం 6 గంటలకు కన్నుమూశారు. ఈయన గత మూడేళ్లుగా హృద్రోగంతో బాధపడుతున్న విషయం విధితమే. ఈయన గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, ఆర్టీసీ రీజనల్ చైర్మన్‌గా, డిసిసిబి చైర్మన్‌గా, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా ఇలా అనేక పదవులు నిర్వహించారు. ఈయన 1978లో తొలిసారిగా తెర్లాం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇందిరా కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలుపొందారు. 1985, 89, 94లో ఎమ్మెల్యేగా అదే నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యారు. తిరిగి 1999లో టీడీపీ అభ్యర్ధి జయప్రకాష్‌పై పోటీచేసి విజయం సాధించారు. ఆ తరువాత 1982-85 మధ్య కాలంలో డిసిసిబి చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 1987లో జెడ్పీ చైర్మన్ పదవికి పోటీచేసి టీడీపీ అభ్యర్ధి చొక్కాపు సూర్యనారాయణ చేతిలో ఓటమి పాలయ్యారు. 2003-09 వరకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా పనిచేశారు. తరువాత కాంగ్రెస్‌తో విభేదాలు వచ్చి ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. తరువాత ఎమ్మెల్సీగా పనిచేశారు. ప్రత్యేక హోదా సాధన విషయంలో టీడీపీ విఫలం చెందిందని ఆయన టీడీపీ పార్టీకి రాజీనామా చేశారు. తరువాత వైసీపీ అధినేత వైఎస్ జగన్ జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు ఆ పార్టీలో చేరారు. కొంతకాలం వైసీపీలో పనిచేసిన తరువాత అనారోగ్య కారణాలతో రాజకీయాలకు దూరంగా ఉన్నారు. చివరకు బొబ్బిలి ప్రభుత్వ ఆసుపత్రిలో ఆదివారం ఆయన తుదిశ్వాస విడిచారు.

*మాజీ ఎమ్మెల్యే వాసిరెడ్డి వరద రామారావు (ఫైల్‌ఫొటో )