ఆంధ్రప్రదేశ్‌

ప్రజలు తిరస్కరించినా బాబులో మార్పు రాలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, అక్టోబర్ 13: సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ప్రజలు తిరస్కరించినా చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ నేతల వైఖరిలో మార్పు రాలేదని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే కొలుసు పార్ధసారధి పేర్కొన్నారు.
ఆదివారం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల చంద్రబాబు మాట్లాడుతున్న వైఖరిని చూస్తుంటే ఆయన నైతికంగా ఎంత దిగజారారో అవగతం అవుతుందన్నారు. పార్టీ నుండి సహచరులు వీడుతుంటే ఆయన పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్న విషయం బాబు మాటలతోనే తేటతెల్లం అవుతోందన్నారు. గడిచిన ఐదేళ్ల కాలంలో జన్మభూమి కమిటీలు ప్రజలను దోచుకుతిన్నాయని ఆరోపించారు. అధికార అహంకారంతో వైఎస్ జగన్‌ను కించపరిచేలా మాట్లాడేవారని, ఇప్పుడు కూడా ఓటమి చెందాక అదే తీరును కొనసాగిస్తున్నారన్నారు. చంద్రబాబు వ్యవస్థలను భ్రష్టు పట్టించారని, వాటిని గాడిలో పెట్టేందుకు ముఖ్యమంత్రి జగన్ ప్రయత్నిస్తుంటే బాబు పోలీసులను, అధికారులను బెదిరించే రీతిన మాట్లాడటం సమంజసం కాదన్నారు.
గత ఐదు సంవత్సరాల కాలంలో అభూత కల్పనలతో, బాహుబలి సెట్టింగ్‌లతో అబద్దాలే పునాదిగా ప్రజలను మోసగించిన చంద్రబాబు, నేడు అదే నైజంతో ముందుకెళ్తున్నారని విమర్శించారు. 40 సంవత్సరాల అనుభవం, 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశానని చెప్పుకునే బాబు ప్రభుత్వం చేస్తున్న వాటిలో లోపాలను ఎత్తిచూపాలే తప్ప సైకో మాదిరిగా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. రివర్స్ టెండరింగ్‌తో 800 కోట్లు ఆదా చేశామని, అది మీకు ఉన్మాదంగా కనిపిస్తోందా అని ప్రశ్నించారు. వయస్సు మీద పడటంతో బాబు ఏం మాట్లాడాలో తెలియని స్థితిలో ఉన్నారని ప్రజలే వ్యాఖ్యానిస్తున్నారన్నారు. సీఎం జగన్మోహనరెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా వాహన మిత్ర పథకాన్ని అమలు చేసి లక్షా 73 వేల మందికి ఏడాదికి 10 వేల రూపాయల చొప్పున ఐదేళ్ల కాలంలో 50 వేలు ఇస్తుంటే టీడీపీ నేతలకు కడుపుమంటగా ఉండటం బాధాకరమన్నారు. చంద్రబాబుతో పాటు ఆ పార్టీ నేతలు ఇసుక ఇసుక అంటూ కొంగజపం చేస్తున్నారని, ప్రభుత్వాలు మారినప్పుడు విధానాలు కూడా మారతాయని, ఇసుక సరఫరాలో ఇబ్బందులు ఉంటే వాటిని సవరించామని తెలిపారు. ఉద్యోగాలను భర్తీ చేస్తుంటే ఓ వర్గం మీడియా అవినీతి జరిగిందని, మంత్రుల బంధువులకు వచ్చాయంటూ విషప్రచారం చేయడం సరికాదన్నారు. గడిచిన ఐదేళ్లకాలంలో మూడున్నర లక్షల కోట్ల రూపాయల అప్పులుచేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన బాబు ఇకనైనా బుద్ధి తెచ్చుకుని ప్రవర్తించాలని పార్ధసారధి హితవు పలికారు.
*చిత్రం...విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కొలుసు పార్ధసారధి