ఆంధ్రప్రదేశ్‌

తిరుమల వెంకన్ననూ వదలని వైసీపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, అక్టోబర్ 13: రాష్ట్ర ప్రజలనేకాక చివరికి తిరుమల వెంకన్నను కూడా వైసీపీ ప్రభుత్వం వదలిపెట్టడం లేదని, ఇటీవల జరిగిన దసరా వేడుకల సందర్భంగా తిరుమలకు వచ్చే భక్తులకు ఏర్పాట్లు చేయడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కంభంపాటి రామ్మోహనరావు ధ్వజమెత్తారు. టీడీపీ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఆదివారం జరిగిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరుపతిలో వీఐపీలకు ప్రాధాన్యత ఇవ్వటం లేదని చెప్తూనే తమ పార్టీ నేతలకు మాత్రం పెద్దపీట వేస్తున్నారని దుయ్యబట్టారు. స్వామి దర్శనార్ధం వచ్చే భక్తులు నానా అవస్థలు పడుతుంటే టీటీడీ సభ్యులు ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులుగా 36 మందిని నియమించారని, ఇందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ సిఫార్సులు, వైసీపీతో సన్నిహితంగా ఉండే కొందరు పారిశ్రామికవేత్తలను సంతృప్తి పరచేందుకు ట్రస్టు బోర్డును ఏర్పాటు చేశారే తప్ప భక్తుల మనోభావాలను పరిగణనలోకి తీసుకోలేదన్నారు. టీటీడీ బోర్డు సభ్యుల్లో ఎక్కువమంది ధనవంతులు, డెకాయిట్లు ఉన్నారని ఎద్దేవా చేశారు. టీటీడీ బోర్డులో జగన్ కేసులో నిందితులుగా ఉన్న నారాయణస్వామి శ్రీనివాసన్, కాల్‌మనీ, వరకట్నం వేధింపు కేసులో నిందితులుగా ఉన్న పరిగల మురళీ కృష్ణ, క్రిమినల్ కేసుల్లో నిందితులుగా ఉన్నవారిని సభ్యులుగా నియమించారని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో శేఖర్‌రెడ్డిని చంద్రబాబునాయుడు బినామీగా సృష్టించిన వైసీపీ నాయకులు ఈ రోజు అదే శేఖర్‌రెడ్డిని టీటీడీ ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించడమేంటని దుయ్యబట్టారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకే తెలంగాణకు చెందిన ఏడుగురిని టీటీడీ బోర్డు సభ్యులుగా నియమించారని, జగన్ ప్రభుత్వంలో టీటీడీ బోర్డు రాజకీయ పునరావాస కేంద్రంగా మారిందని, ఇది కోట్లాదిమంది హిందువుల మనోభావాలను దెబ్బతీయడమేనన్నారు.