ఆంధ్రప్రదేశ్‌

పోలీసుల్ని బెదిరించేలా చంద్రబాబు వైఖరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, అక్టోబర్ 12: డీజీపీ, పోలీస్ యంత్రాంగాన్ని బెదిరించేలా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలు చేస్తున్నారని మంత్రి అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు. విశాఖలో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెండు రోజుల పాటు టీడీపీ సమావేశాల్లో పాల్గొన్న చంద్రబాబు ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేశారన్నారు. చంద్రబాబు భాష, బాడీ లాంగ్వేజ్ ఏమాత్రం బాగాలేదన్నారు. ఒక పరిణితి చెందిన రాజకీయ నాయకుడు మాట్లాడేతీరు ఇదేనా అని ప్రశ్నించారు. మా అధినేత ఊ అంటే చంద్రబాబుకు ప్రతి పక్ష హోదా కూడా ఉండదని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష నేతగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం జరుగుతున్న ఉద్యమంలో పాల్గొనేందుకు విశాఖ వస్తే ఎయిర్ పోర్టు నుంచి బయటకు కూడా రానీయకుండా అడ్డుకున్న విషయం మర్చిపోయి మాట్లాడుతున్నారన్నారు. మా ప్రభుత్వం కూడా అలా చేయాలనుకుంటే పార్టీ కార్యకర్తలతో సమీక్షకు రాగలరా అంటూ నిలదీశారు. నాలుగు నెలల కాలంలోనే ప్రజల్లో మంచి పాలనాదక్షునిగా పేరు తెచ్చుకుంటున్న జగన్‌ను చూసి భయపడుతున్నారని, అందుకే వాస్తవాలను వక్రీకరించి మాట్లాడుతున్నారని ఆరోపించారు. వైసీపీపైనా, ముఖ్యమంత్రి జగన్‌పైనా విమర్శలు ఆపకపోతే తమకు పోలీసుల సహాయం కూడా అవసరం ఉండదని స్పష్టం చేశారు. విశాఖ అంటే ఎంతో ప్రేమ ఒలకబోస్తున్న చంద్రబాబు తన హయాంలో జరిగిన కుంభకోణాలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో జరిగిన అభివృద్ధి అంతా కుంభకోణాల మయమని, వీటిపై విచారణ జరిగితే జాతకాలు తేలుతాయన్నారు. నూతన ఇసుక పాలసీపై విమర్శలు చేస్తున్న బాబు తన హయాంలో పార్టీ కార్యకర్తలు దోచుకునేందుకు తెరతీశారన్నారు. కొత్త పాలసీ వచ్చిన తరువాత వరదల కారణంగా ఇసుక లభ్యత తగ్గిందన్నారు. ఇసుకపై చర్చకు చంద్రబాబు సిద్ధమా అన్ని ప్రశ్నించారు.