ఆంధ్రప్రదేశ్‌

నన్నయ ప్రతిష్టను దెబ్బతీసేలా ఫిర్యాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, అక్టోబర్ 12: ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఆంగ్ల విభాగాధిపతి డాక్టర్ ఎన్ సూర్య రాఘవేంద్రపై వచ్చిన ఫిర్యాదు ఉందని వీసీ ఆచార్య పి సురేష్ వర్మ అన్నారు. విశ్వవిద్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వీసీ మాట్లాడారు. ఆంగ్ల విభాగాధిపతి సూర్య రాఘవేంద్రపై వచ్చిన ఫిర్యాదును విశ్వవిద్యాలయం చాలా తీవ్రంగా పరిగణించిందన్నారు. ఇటువంటి ఫిర్యాదుల్లో విశ్వవిద్యాలయ నిబంధనల ప్రకారం విశ్వవిద్యాలయం ఉమెన్స్ సెల్‌కు సంబంధిత ఫిర్యాదును అప్పగించామని వీసీ తెలిపారు. ఉమెన్ సెల్ కమిటీ ప్రాధమిక విచారణ అనంతరం కొన్ని విషయాలు తెలియ జేశారన్నారు. వాటి ఆధారంగా ఫిర్యాదులో కొన్ని అవాస్తవాలు ఉన్నట్టు వెల్లడించారన్నారు. డాక్టర్ ఎన్ సూర్య రాఘవేంద్రపై వచ్చిన ఫిర్యాదు ప్రకారం విద్యార్థులు 2017-19 బ్యాచ్‌కి చెందినవారని తెలుస్తోందన్నారు. సదరు ఫిర్యాదులో పేర్కొన్న దాని ప్రకారం వీసీ ఆచార్య పి సురేష్ వర్మకి, సూర్య రాఘవేంద్రకు సన్నిహిత సంబంధాలు ఉన్న కారణంగా వీసీ సురేష్ వర్మకు ఫిర్యాదు చేయలేదని, ఫిర్యాదు చేసినా ప్రయోజనం ఉండదని పేర్కొన్నారని, అయితే తాను 2017-19 విద్యా సంవత్సరం నాటికి వీసీగా బాధ్యతల్లో లేనని వీసీ సురేష్ వర్మ స్పష్టం చేశారు. ఈ క్రమంలో విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం పూర్తి చేసుకుని వెళ్లిపోయిన విద్యార్థులు ఈ విధమైన ఫిర్యాదు చేయడం వెనుక అంతరార్ధం ఏమిటో తెలియాల్సి ఉందని వీసీ అన్నారు. అలాగే ఎటువంటి సంతకాలు లేకుండా ఫిర్యాదు వచ్చిందన్నారు. విశ్వవిద్యాలయం ఉమెన్స్ సెల్ కమిటీ ప్రాధమిక విచారణలో భాగంగా సదరు ఫిర్యాదుదారులకు ఫోన్ చేసినా ఫోన్లు పని చేయలేదని తెలిపారు. ఈ విధంగా సంతకాలు లేని ఫిర్యాదు చేయడం, ఫిర్యాదుదారు లు స్పందించకపోవడం, ఫిర్యాదులో కొన్ని అవాస్తవాలు ఉండటం ఫిర్యాదుపై అనుమానాలకు తావిస్తోందన్నారు. విశ్వవిద్యాలయం ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఫిర్యాదు ఉందన్నారు. ఏదేమైనప్పటికీ సదరు ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపిం చి వాస్తవాలను వెలికి తీస్తామని, విచారణను వేగవంతం చేస్తున్నామని, పూర్తి నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని వీసీ పేర్కొన్నారు. ఆ సమయంలో విద్యార్థులను కూడా వాకబు చేస్తామని, ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రొఫెసర్‌ను కూడా విచారిస్తామన్నారు. నిజనిర్ధారణ కమిటీ ఉన్నత స్థాయి కమిటీని నియమిస్తామన్నారు.