ఆంధ్రప్రదేశ్‌

సమర్థులకే పదవులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, అక్టోబర్ 10: వచ్చే మూడు దశాబ్దాల పాటు పార్టీ నిలబడేలా సమర్థులకే పదవులిచ్చి సుస్థిర నాయకత్వాన్ని తీసుకువస్తానని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. విశాఖలో రెండు రోజుల పాటు జరిగే పార్టీ సంస్థాగత సమావేశం, నియోజకవర్గ సమీక్షలను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవంబర్ నుంచి పార్టీ సంస్థాగత ఎన్నికలు ప్రారంభం కానున్నాయని, గ్రామ, వార్డు స్థాయిల్లో సమర్థులను మీరే ఎంపిక చేసుకుని, ఎన్నుకునే విధానాన్ని అమల్లోకి తెస్తానన్నారు. నాయకత్వాన్ని ఎంపిక చేసుకోవడంలో మేం జోక్యం చేసుకోబోమని భరోసానిచ్చారు. ఎన్నికైన పార్టీ ప్రతినిధులు పనిచేయకుండా నిద్రపోతే వారిని తొలగించేందుకు రీకాల్ విధానాన్ని సంస్థాగత ఎన్నికల ప్రక్రియలోకి తీసుకువస్తామని ఉద్ఘాటించారు. సంస్థాగత ఎన్నికల్లో కచ్చితంగా ఎస్సీ,ఎస్టీ,బీసీలకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు 33 శాతం మహిళా రిజర్వేషన్ అమలు చేస్తామన్నారు. పార్టీ పదవుల్లో ఎప్పటికీ పాతతరం నాయకత్వమే ఉంటే సరిపోదని, పాత వారితో పాటు యువతకు సముచిత స్థానం కల్పిస్తూ సమతౌల్యం పాటిస్తామన్నారు. పదవులకు అభ్యర్థుల ఎంపికలో మొహమాటాలకు తావు లేదని, గతంలో కొన్ని మొహమాటాలకు పోయి నష్టపోయామని పేర్కొన్నారు. నాలుగున్నర నెలల పాలనలో వైసీపీ ప్రభుత్వం టీడీపీ నాయకులు, కార్యకర్తలు లక్ష్యంగా దాడులకు తెగబడుతోందని ధ్వజమెత్తారు. కార్యకర్తలపై కేసులు పెడుతూ వేధిస్తున్నారని, సీనియర్ నాయకులు మొదలు సామాన్య కార్యకర్త వరకూ వైసీపీ ప్రభుత్వం పెడుతున్న కేసులతో వేదన అనుభవిస్తున్నారన్నారు. అటువంటి వారికోసం పార్టీ అండగా ఉంటుందన్నారు. మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేస్తా, కార్యకర్తలకు న్యాయ సహాయం అందించేందుకు అవసరమైతే భిక్షమెత్తేందుకు కూడా సిద్ధమేనని ఉద్వేగ పూరితంగా భరోసానిచ్చారు.
పోలీసులూ.. తీరు మార్చుకోండి
ప్రభుత్వాలు వస్తాయి, పోతాయి. పార్టీలు మారితే ప్రభుత్వ విధానాలు మారకూడదు. పోలీసులు శాంతి భద్రతలు అదుపులో ఉండేలా చూడాలి తప్ప, అధికార పార్టీకి కొమ్ముకాసే విధంగా ఉండకూడదని చంద్రబాబు హితవు పలికారు. అధికార పార్టీ అండగా ఉందని టీడీపీ కార్యకర్తలపై దాష్టీకాలకు పాల్పడే పోలీసు అధికారులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. చట్ట పరిధిలో మీ నిర్ణయాలను ప్రశ్నించే అధికారం న్యాయ వ్యవస్థకు ఉందని, న్యాయ స్థానం జోక్యం చేసుకుంటే అధికారులు ఇబ్బంది పడాల్సి ఉంటుందన్నారు. వైసీపీ దౌర్జన్యాలు, సోషల్ మీడియా వ్యాఖ్యలపై తమ కార్యకర్తలు ఫిర్యాదు చేస్తే స్పందించని డీజీపీ, వైసీపీ వాళ్లు ఇచ్చే ఫిర్యాదులపై మాత్రం తక్షణమే చర్యలు తీసుకుంటున్నారని ఆరోపించారు. విశాఖలోనూ ఒక పోలీసు అధికారి అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని, తిరిగి మేం అధికారంలోకి రామనుకుంటే అది పొరపాటేనన్నారు. అప్పుడు మీరు ఇబ్బందులు పడతారని గుర్తుంచుకోవాలని హితవు పలికారు.
*చిత్రం... టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు