ఆంధ్రప్రదేశ్‌

సమ్మె బాటలో మీ సేవ సిబ్బంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, అక్టోబర్ 9: రాష్ట్రంలో మీ సేవ కేంద్రాలను మూసివేసి నిరసన వ్యక్తం చేయడానికి ఆయా కేంద్రాల నిర్వాహకులు సంసిద్ధమవుతున్నారు. ఈనెల 15వ తేదీ నుంచి నిరవధిక సమ్మెలో పాల్గొనాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం. ఈమేరకు నేడోరేపో రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అంతా సక్రమంగా జరిగితే సమ్మె విరమిస్తామని, లేదంటే ఈనెల 15వ తేదీ తరువాత ఏ క్షణ్నాయినా నిరవధిక సమ్మె ప్రారంభిస్తామని నిర్వాహకులు వెల్లడిస్తున్నారు. రాష్ట్ర సంఘం ఒకటి రెండు రోజుల్లో పూర్తిస్థాయి సమావేశం నిర్వహించి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించారు. సమ్మెకు వెళ్లాలని అత్యధిక సంఖ్యలో సభ్యులు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. రాష్టవ్య్రాప్తంగా 13 జిల్లాల్లో సుమారు 11 వేలకు పైగా మీ సేవ కేంద్రాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ కేంద్రాల ద్వారా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించి అన్ని శాఖలకు సేవలందిస్తున్నారు. ఒక్కొక్క సేవకు గాను ప్రజల నుంచి రూ.35 నుంచి సేవను బట్టి రూ.250 వరకు వసూలు చేస్తున్నారు. ఇందులో ప్రభుత్వానికే అత్యధిక వాటా ఉంటుందని, మీ సేవ కేంద్ర నిర్వాహకులకు ఒక్కొక్క సేవకు గాను గరిష్టంగా రూ.20 మాత్రమే వస్తోందని నిర్వాహకులంటున్నారు. ఇందులోనే నిర్వహణ ఖర్చు, అద్దెలు, విద్యుత్, తదితర ఖర్చులన్నీ భరించి మిగిలిన సొమ్ము మాత్రమే తమ కుటుంబ అవసరాలకు వినియోగించుకుంటున్నామని వారు తెలిపారు. ఒక్కొక్క మీ సేవ కేంద్రం ఏర్పాటుకు రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు పెట్టుబడి పెడుతున్నారు. అయితే తాజాగా ప్రభుత్వం గ్రామ, వార్డు, సచివాలయాలను ఏర్పాటు చేసి అక్కడి నుంచే అన్ని సేవలను నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తోంది. ఫలితంగా మీ సేవ కేంద్రాలను నమ్ముకుని జీవిస్తున్న తమ కుటుంబాలు వీధుల పాలవుతాయని వారంటున్నారు. ఒక్కొక్క మీ సేవ కేంద్రంలో సగటున ఐదుగురు పనిచేస్తున్నారు. వీరంతా ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయాల నుంచి ప్రజలకు మీ సేవ కార్యకలాపాలన్నింటినీ నిర్వహిస్తే తాము కేవలం కేంద్ర ప్రభుత్వ శాఖలకు సంబంధించిన సేవలను మాత్రమే నిర్వహించాల్సి ఉంటుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ సర్వీసులకు సంబంధించి గరిష్టంగా ప్రతిరోజూ మూడు సేవలకంటే ఎక్కువ ప్రజలకు అందించలేమని వారంటున్నారు. దీనివల్ల ఎలాంటి ఉపాధి లేకపోగా తామే చేతి నుంచి ఖర్చులు భరించాల్సి వస్తుందని, అలాంటి పరిస్థితి వస్తే మీ సేవ కేంద్రాలను ఎత్తివేయాల్సిందేనని అంటున్నారు. ప్రభుత్వం గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి ప్రభుత్వ సేవలను తీసుకుని వచ్చినా ఆయా సేవలను మీ సేవ కేంద్రాలకు అప్పగిస్తే ఇటు ప్రభుత్వ లక్ష్యం నెరవేరడంతో పాటు మీ సేవను ఆధారం చేసుకుని జీవిస్తున్న తమలాంటి వారికి కూడా ఉపాధి లభించనట్లవుతుందని పేర్కొంటున్నారు. రానున్న నాలుగైదు రోజుల్లోనే మీ సేవ కేంద్రాల భవితవ్యం తేలుతుంది.