ఆంధ్రప్రదేశ్‌

10 లక్షలు దాటితే.. రివర్స్ టెండరింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, అక్టోబర్ 9: రివర్స్ టెండరింగ్ విధానంలో మార్పులు చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై రూ. 10 లక్షల నుంచి రూ. 100 కోట్ల లోపు పనులకు రివర్స్ టెండరింగ్‌ను వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన విధి విధానాలకు రూపకల్పన చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ లోగా ప్రస్తుతం ఉన్న ఈ-ప్రొక్యూర్‌మెంట్ ప్లాట్‌ఫాం మీదే సాధ్యమైనంత మేర పారదర్శకత ఉండేలా జాగ్రత్తలు పాటించాలని నిర్దేశించారు. బుధవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రూ. 100 కోట్లు పైబడిన కాంట్రాక్ట్ పనులను ముందస్తు న్యాయ సమీక్ష (జ్యుడిషియల్ ప్రివ్యూ) కమిటీకి నివేదించటంతో పాటు రివర్స్ టెండరింగ్‌ను ఇప్పటికే అమలు చేస్తున్నారు. ఇకపై రూ. 10 లక్షల పైబడిన పనులకు కూడా రివర్స్ టెండరింగ్‌కు వెళ్లాలని నిర్ణయించారు. వివిధ పనులు, సర్వీస్‌లు, కొనుగోళ్ల కోసం ఆహ్వానించే టెండర్లలో పారదర్శకతకు పెద్దపీట వేయాలనే భావనతో రివర్స్ టెండరింగ్‌ను మరింత పటిష్టం కావాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ కాంట్రాక్ట్‌లు, సర్వీస్‌లు, కొనుగోళ్లలో ప్రజాధనం ఆదా కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. రూ. 100 కోట్ల పైబడిన
పనులకు రివర్స్ టెండరింగ్ నిర్వహించడం ద్వారా విప్లవాత్మక మార్పులు, సంస్కరణలు తీసుకు వచ్చామన్నారు. కనీసం ఐదుగురు, అంతకు మించి బిడ్డింగ్‌లో పాల్గొంటే మొదటి 60 శాతం మంది (బిడ్డింగ్‌లో 10 మంది పాల్గొంటే అందులో 1 నుంచి 6 వరకు) రివర్స్ టెండరింగ్‌కు అర్హులయ్యేలా నూతన విధానం ప్రవేశపెట్టాలని అధికారులను ఆదేశించారు. దీనివల్ల బిడ్డింగ్ ప్రక్రియలో కోట్ చేసేటప్పుడు వాస్తవికత ఉంటుందని, రివర్స్ టెండరింగ్‌లో మరింత పోటీకి దారి తీస్తుందన్నారు. రూ. 10 లక్షల నుంచి 100 కోట్ల లోపు పనులు, సర్వీస్‌లు, కొనుగోళ్లకు కూడా ఇలాంటి సంస్కరణలు అవసరమన్నారు. శాశ్వత ప్రాతిపదికన పారదర్శకత ఉండేందుకు ఈ విధానాన్ని అవలంబించాలని సూచించారు. టెండర్లలో ఎక్కువ మంది పాల్గొనేలా నూతన విధానానికి రూపకల్పన జరగాలని చెప్పారు. టెండర్లలో పాల్గొనే ఎవరికైనా నిరుత్సాహం కలిగించే పరిస్థితి ఉండరాదన్నారు. టెండర్ షెడ్యూల్‌లో పేర్కొన్న అంశాలు మరింత విశదీకరంగా ఉండాలని, అందరికీ అందుబాటులో ఉంచాలన్నారు. తక్కువ ధరకు కోట్‌చేసిన టెండర్ వివరాలను ఈ- ప్రొక్యూర్‌మెంట్ సైట్‌లో నిక్షిప్తం చేయాలని, వారం రోజుల పాటు ఈ వివరాలు అందరికీ అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఆ తరువాత రివర్స్ టెండరింగ్‌కు వెళ్లాలని సూచించారు. రాష్ట్ర స్థాయిలోనే కాక జిల్లాల వారీగా టెండర్లు పిలవాలని స్పష్టం చేశారు. ప్యాకేజీలు కూడ ఎక్కువ మంది పోటీకి వచ్చేలా ఉండాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ సర్వీస్‌లు, పనులు, కొనుగోళ్లలో ఒకేరకమైన విధానం అమల్లోలేదని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. దీనికి స్థిరమైన విధానంలేదని, ఒక్కో శాఖలో ఒక్కో విధంగా వ్యవహరిస్తున్నారని వివరించారు. ఇప్పటి వరకు దీనిపై ఒక జాబితానే లేదన్నారు. ఈ- ప్రొక్యూర్‌మెంట్ కోసం ఉన్న పోర్టల్‌ను పూర్తిస్థాయిలో వినియోగించని వైనాన్ని సీఎం దృష్టికి తెచ్చారు. ప్రభుత్వపరంగా చేస్తున్న కొనుగోళ్లు, అప్పగిస్తున్న సర్వీస్‌లు, పనుల విషయంలో ఒక నిర్దిష్టమైన జాబితాను రూపొందించాలని సీఎం ఆదేశించారు. ఆ తరువాత టెండర్ల విషయంలో ఒకే విధానాన్ని పాటించే విధంగా చూడాలన్నారు. ఇప్పటికే శాఖల వారీగా వివరాలు సేకరిస్తున్నామని, వీటిని పరిగణనలోకి తీసుకుంటే స్పష్టత వస్తుందని సంబంధిత శాఖల కార్యదర్శులతో కమిటీని ఏర్పాటు చేస్తున్నామని ఉన్నతాధికారులు తెలిపారు. మిగిలిన శాఖలతో సమన్వయం చేసుకుని ఆర్థికశాఖ మాన్యువల్ రూపొందిస్తుందని చెప్పారు. కొత్త విధానాన్ని జనవరి ఒకటి నుంచి అమల్లోకి తీసుకురావాలని పునరుద్ఘాటించారు. ఈ పద్ధతిలో బిడ్ దక్కించుకున్న వారికి చెల్లింపులు త్వరితగతిన జరిగేలా సంబంధిత శాఖతో అనుసంధానం చేయాలన్నారు. ప్రభుత్వ సర్వీస్‌లు, పనులు, కొనుగోళ్ల టెండర్లలో ఈ- ప్రొక్యూర్‌మెంట్, జ్యుడిషియల్ ప్రివ్యూ, రివర్స్ టెండరింగ్ ప్రక్రియలు సజావుగా సాగేందుకు ఒక ఐఏఎస్ అధికారిని నియమించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వివరాలను ఎప్పటికప్పుడు ప్రత్యేక అధికారి ప్రభుత్వానికి నివేదించటంతో పాటు రివర్స్ టెండరింగ్ ప్రక్రియ సాఫీగా జరిగే బాధ్యతలు అప్పగించాలన్నారు. జ్యుడిషియల్ ప్రివ్యూకు అవసరమైన వివరాలు అందించటానికి, ప్రాధామ్యాలను నిర్దేశించే బాధ్యత కూడా ప్రత్యేక అధికారికే ఉండాలన్నారు. ప్రివ్యూ కమిటీకి టెండర్ పంపగానే సంబంధిత శాఖ అధికారి న్యాయమూర్తికి వివరించాలని జ్యుడిషియల్ ప్రివ్యూకు తమ తమ శాఖల నుంచి సాంకేతిక సహకారం అందించటానికి అవసరమైన వారిని ప్రతిపాదించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
*చిత్రం...ఈ-ప్రొక్యూర్‌మెంట్‌పై బుధవారం అధికారులతో సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి