ఆంధ్రప్రదేశ్‌

వివాహ వేడుకలో సీఎం జగన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, అక్టోబర్ 9: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి బుధవారం తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం విచ్చేశారు. రాజమహేంద్రవరం నగర నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ కో-ఆర్డినేటర్, ఏపీఐఐసీ మాజీ ఛైర్మన్ శ్రీఘాకోళపు శివరామసుబ్రహ్మణ్యం కుమార్తె వివాహ వేడుకలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నవదంపతులు అమృతవల్లి, శ్రీరంగనాథ్‌ను ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఆశీర్వదించారు. రాజమహేంద్రవరంలో నూతనంగా నిర్మించిన మంజీర ఇంటర్నేషనల్ కనె్వన్షన్ సెంటర్‌లో జరిగిన వివాహ వేడుకలో పాల్గొని ఆశీర్వచనాలు అందించారు. ఈ వివాహ వేడుకలో ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రులు పినిపే విశ్వరూప్, కురసాల కన్నబాబు, వెల్లంపల్లి శ్రీనివాస్, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, కాపు కార్పొరేషన్ ఛైర్మన్ జక్కంపూడి రాజా, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎంపీ మార్గాని భరత్, ఎమ్మెల్యేలు కొండేటి చిట్టిబాబు, పర్వత పూర్ణచంద్ర ప్రసాద్, పెండెం దొరబాబు, జిల్లా కలెక్టర్ మురళీధర్‌రెడ్డి, మాజీ మంత్రి కొప్పన మోహనరావు తదితరులు పాల్గొని నవ దంపతులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు.

*చిత్రం... వధూవరులను ఆశీర్వసిస్తున్న సీఎం జగన్