ఆంధ్రప్రదేశ్‌

పట్టువస్త్రంపై బాపూజీ సత్యాగ్రహ యాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మవరం, సెప్టెంబర్ 23: పట్టువస్త్రాలపై దేవీదేవతల చిత్రాలు, దేశనాయకులు, పక్షులు, జంతువుల బొమ్మలు ముద్రించి తన కళానైపుణ్యాన్ని చాటిన ధర్మవరం చేనేత కళాకారుడు నాగరాజు తాజాగా మరో అద్భుత చిత్రాన్ని ఆవిష్కరించాడు. బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా మహాత్మాగాంధీ చేపట్టిన సత్యాగ్రహయాత్ర నమూనాను పట్టువస్త్రంపై పొందుపరిచి అందరినీ అబ్బురపరిచాడు. బాపూజీ సత్యాగ్రహయాత్ర దృశ్యాన్ని నేసిన పట్టువస్త్రాన్ని డిజైనర్ నాగరాజు పట్టణంలోని తన స్వగృహంలో సోమవారం ఆవిష్కరించాడు.
ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ఢిల్లీలో నేషనల్ హ్యాండ్‌లూమ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో చేనేత వస్త్ర ప్రదర్శన నిర్వహిస్తున్నారన్నారు. ఆ ప్రదర్శనకు తన డిజైన్‌ను పంపాలని ఆహ్వానించారన్నారు. మహాత్ముడి పుట్టిన రోజున ఏర్పాటు చేసే ప్రదర్శనకు పట్టువస్త్రంపై ఆయన చేసిన సత్యాగ్రహయాత్రను ఆవిష్కరించానన్నారు. ఈ అవకాశం తనకు రావడం ఎంతో సంతోషాన్నిస్తోందన్నారు.