ఆంధ్రప్రదేశ్‌

రియల్ ఎస్టేట్ అప్పిలేట్ ట్రిబ్యునల్ ఏపీ చైర్మన్ జస్టిస్ ఎలాంగో ప్రమాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 23: ఏపీ రియల్ ఎస్టేట్ అప్పిలేట్ ట్రిబ్యునల్ చైర్మన్‌గా హైకోర్టు రిటైర్డ్ జస్టిస్ రాజాఎలాంగోచే సోమవారం రాష్ట్ర పురపాలక శాఖ కార్యదర్శి జె శ్యామలారావు ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం శ్యామలారావుతో పాటు లా డిపార్టుమెంట్ కార్యదర్శి జి మనోహర్‌రెడ్డి ఏపేరా చైర్మన్ వి రామనాథ్, సభ్యులు ముళ్లపూడి రేణుక, చందు సాంబశివరావు, ఏపీటిడ్కో ఎండీ ఎం దివాన్, వివిధ శాఖల ఉన్నతాధికారులు జస్టిస్ రాజాఎలాంగోకు అభినందనలు తెలిపారు. జస్టిస్ రాజాఎలాంగో 1955 సెప్టెంబర్ 23న జన్మించారు. 1978 నవంబర్ 15వ తేదీ నుంచి ఆయన న్యాయవృత్తిలో ఉన్నారు. తమిళనాడు, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల హైకోర్టులో సుదీర్ఘకాలం న్యాయమూర్తిగా పని చేశారు.