ఆంధ్రప్రదేశ్‌

గోదావరిలో కొనసాగుతున్న గాలింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 23: తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు మందం వద్ద గోదావరిలో సంభవించిన టూరిజం బోటు ప్రమాదంలో గల్లంతైన 14మంది ఆచూకీ కోసం గాలింపుచర్యలు కొనసాగుతున్నాయి. బోటును వెలికితీయాలని, ఇంకా ఆచూకీ లభించని వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగించాలని గల్లంతైన వారి బంధువులు రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి వద్ద సోమవారం ఆందోళనకు దిగారు. బోటును వెలికి తీయకపోతే నిజాలు జలసమాధి అయినట్టేనని ఆందోళనలో పాల్గొన్న మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ ఆరోపిస్తున్నారు. బోటు ప్రమాదంలో ప్రభుత్వం చెబుతున్న దానికంటే అదనంగానే చిక్కుకున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
దీనికి తోడు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చాక కూడా బోటుతీయడం అంత సులువైన పనికాదని ప్రకటనలు జారీచేస్తుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా రెండు రోజుల విరామం తర్వాత ధర్మాడ సత్యం అనే నిపుణిడిని సోమవారం మళ్ళీ రంగంలోకి దింపారు. బోటు మునిగిపోయిన కచ్చులూరు వద్ద ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్టీఆర్‌ఎఫ్ బృందాలు గాలింపు కొనసాగిస్తున్నాయి. మరోవైపు హెలీకాప్టర్ ద్వారా కూడా గాలింపు చర్యలు సాగుతున్నాయి. బోటు వెలికి తీయడం ఆలస్యమవుతున్న కొద్ది నిజాలు జలసమాధి అవుతున్నాయని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కచ్చులూరు వద్ద ప్రమాదానికి ముందు దేవీపట్నం పోలీసులు తీసిన ఫొటోలను విడుదలచేశారు. ఈ ఫొటోలను బట్టి చూస్తుంటే ప్రభుత్వం చెప్పే లెక్కకంటే అదనంగానే బోటులో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రమాదం జరిగి సోమవారానికి ఎనిమిది రోజులైంది. బాధిత కుటుంబాల వారు తమ వారి ఆచూకీ కోసం ఎదురుచూస్తున్నారు. రోజు రోజుకీ వారి ఆవేదన వర్ణనాతీతంగావుంది. ఇప్పటి వరకు 37 మృతదేహాలు లభించాయి. ఇంకా 14 మంది ఆచూకీ తెలియాల్సివుంది.
ఇదిలావుండగా కచ్చులూరు వద్ద జరిగిన ప్రమాదానికి నూటికి నూరు పాళ్లు అధికారుల తప్పిదమేనని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ప్రతీ రోజూ టూరిజం బోట్లను తనిఖీచేయాల్సిన పోలీసు, రెవెన్యూ అధికారులు గత ఆరు నెలలుగా సక్రమంగా తనిఖీ చేయడం లేదని ప్రాథమికంగా గుర్తించారు. గోదావరి ప్రవాహం తక్కువగా వుండే మే నెలలో సైతం ప్రమాదకరంగా వుండే కచ్చులూరు మందం వద్ద టూరిస్టులను అప్రమత్తంగా ఉండాలని బోట్ల సిబ్బంది చెబుతూవుంటారు. కచ్చులూరుకి సుమారు 5 కిలోమీటర్ల ఎగువ వరకూ భోజనాలకు ఏర్పాట్లుచేయరు. కానీ ప్రమాదానికి గురైన రాయల్ వశిష్ఠ సిబ్బంది మాత్రం ప్రమాదకరమైన కచ్చులూరు మందం వద్ద టూరిస్టులను బోటుపై నుంచి కేబిన్‌లోకి దింపి భోజనాలు పెడుతున్న సమయంలో ఈ ప్రమాదం జరగడంతో క్యాబిన్‌లో పెద్ద సంఖ్యలో చిక్కుకుని, ప్రాణనష్టం ఎక్కువగా ఉందనే వాదన వినిపిస్తోంది.
యంత్ర సామాగ్రిని తరలించే మార్గంలేని ప్రదేశంలో సుమారు 315 అడుగుల కింద మునిగి వున్న టూరిజం బోటును 99.9 వరకు బయటకు తీయడం అసాధ్యమని, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వుండాలని, అందుకు చర్యలు చేపట్టామని అధికారులు చెబుతున్నారు.