ఆంధ్రప్రదేశ్‌

తీరనున్న ఇసుక కొరత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 41,37,675 క్యూబిక్ మీటర్ల ఇసుక నిల్వలు సిద్ధంగా ఉన్నాయని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి వెల్లడించారు. ఈ నెల 5 నుంచి నూతన ఇసుక విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తేగా, ఇప్పటి వరకు లక్ష క్యూబిక్ మీటర్ల మేర ఇసుకను వినియోగదారులకు సరఫరా చేశామని మంత్రి పెద్దిరెడ్డి సోమవారం మీడియాకు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల పరిధిలో 102 ఇసుక రీచ్‌లను 51 స్టాక్ యార్డులను సిద్ధం చేశామన్నారు. మొత్తం 41 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక సరఫరా కోసం టెండర్లను ఆహ్వానించామన్నారు. గోదావరి, కృష్ణానదిలో వరదల కారణంగా ఇసుక రవాణా కొంత ఇబ్బందికరంగా మారిందని చెప్పారు. వరదలు తగ్గుముఖం పట్టగానే పూర్తి స్థాయిలో ఏపీఎండీసీ ద్వారా రవాణా కొనసాగిస్తామని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 40 స్టాక్ యార్డులు పనిచేస్తున్నాయని చెప్పారు. మొత్తం 20 వేయింగ్ మిషన్లు ఇందుకోసం ఏర్పాటు చేశామన్నారు. పట్ట్భాముల నుంచి కూడా ఇసుక తవ్వకాలు జరిపి, సరఫరాకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రధానంగా అనంతపురం జిల్లాలో ఎక్కువ మంది రైతులు ఇందుకు సంసిద్ధత వ్యక్తం చేశారని తెలిపారు. ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం పాలేరు వాగులో సురు 263 ఎకరాల్లో
ఇసుక టెండర్ల ప్రక్రియ చివరి దశకు వచ్చిందన్నారు. నెల్లూరు జిల్లాలో 12 రీచ్‌ల నుంచి 4లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను రోజుకు పదివేల క్యూబిక్ మీటర్ల చొప్పున సరఫరా చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు వివరించారు. గుంటూరు, కృష్ణా, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో కొత్త రీచ్‌లను గుర్తించామన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాల్లో పడవల ద్వారా ఇసుక రవాణా చేసేందుకు అనుమతించామని తెలిపారు. కృష్ణా, గోదావరి నదుల్లో వరద తగ్గుముఖం పట్టిన వెంటనే అవసరానికి తగిన ఇసుక నిల్వలు అందుబాటులోకి వస్తాయన్నారు. జిల్లాల వారీగా నిల్వల వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళంలో 5,09,360 క్యూబిక్ మీటర్లు, తూర్పుగోదావరిలో 6,33,358, పశ్చిమ గోదావరిలో 2,22,230, కృష్ణాలో 7,11,800, గుంటూరులో 5,50,254, నెల్లూరులో 4,21,145, కడపలో 5,05,928, కర్నూలులో 1,97,600, అనంతపురంలో 2,50,500, చిత్తూరులో 1,35,500 క్యూబిక్ మీటర్ల మేర అందుబాటులో ఉంది.