ఆంధ్రప్రదేశ్‌

కరకట్టపై అక్రమ నిర్మాణాల కూల్చివేతకు ఏపీసీఆర్డీఏ సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: కృష్ణా నది కరకట్ట వెంబడి నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేసేందుకు ఏపీసీఆర్డీఏ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. కృష్ణా నదీతీరంలో ఆక్రమ కట్టడాలుగా గుర్తించిన 24 కట్టడాలకు ప్రాథమికంగా సీఆర్‌డీఏ నోటీసులు జారీ చేసింది. ఇందులో 5 కట్టడాలకు సంబంధించి ఆయా కట్టడాల యజమానులు ఇచ్చిన వివరణలు సహేతుకంగా లేకపోవడంతో వాటిపై తదుపరి చర్యలకు సిద్ధం చేస్తున్నారు. మిగిలిన 19 కట్టడాల్లో 5 కట్టడాలకు సంబంధించి హైకోర్టు ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. గుంటూరు జిల్లా ఉండవల్లి గ్రామ పరిధిలో కృష్ణానది కరకట్టపై పాతూరి కోటేశ్వరరావు అనే వ్యక్తి నిర్మించిన అక్రమ కట్టడానికి జూన్ 6న నోటీసులు జారీ చేశారు. సంబంధిత అధికారుల నుంచి, నదీ పరీరక్షణ చట్టం నుంచి ఎటువంటి ముందస్తు అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టడంపై నోటీసులు జారీ చేశారు. కోతను నివారించేందుకు వీలుగా కాంక్రీట్ గోడ నిర్మించినట్లు భవన యజమాని ఇచ్చిన వివరణలో ఏమాత్రం సహేతుకత లేకపోవడంతో అధికారులు ఆ నిర్మాణాన్ని సోమవారం కూల్చివేశారు.