ఆంధ్రప్రదేశ్‌

మేఘాకు పోలవరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 23: పోలవరం హెడ్ వర్క్స్, పవర్‌హౌస్ రీ టెండరింగ్ బిడ్‌ను మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థ దక్కించుకుంది. సోమవారం జలవనరులశాఖ ఆధ్వర్యంలో బిడ్‌లను తెరిచారు. 4987.55 కోట్ల అంచనా విలువతో ఆహ్వానించిన ఈ టెండర్లను 12.6 శాతం తక్కువకు రూ. 4359.11 కోట్లతో పూర్తిచేసేందుకు మేఘా సంస్థ ముందుకొచ్చింది. దీంతో ప్రభుత్వ ఖజానాకు రూ. 628.43 కోట్ల మేర ఆదా అయిందని జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. ఇలాఉంటే హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్ రీ టెండరింగ్ వల్ల అదనంగా మరో రూ. 152 కోట్లు ఆదా అవుతుందని అధికారులు తెలిపారు. దీంతో మొత్తం మీద 780 కోట్ల రూపాయల మేర ప్రభుత్వానికి ఆదా అయిందని అధికారులు తెలిపారు.
హెడ్‌వర్క్స్, గేట్ల నిర్మాణం సహా పవర్‌హౌస్‌కు ఏపీ జెన్‌కోతో కలిపి జలవనరులశాఖ ఈ ఏడాది ఆగస్టు 17న బిడ్ డాక్యుమెంటేషన్లను అప్‌లోడ్ చేసింది. మెయిన్ డ్యాం హెడ్ వర్క్స్ ప్యాకేజీ పనుల విలువ 1771.44 కోట్లు. 24 నెలల కాల వ్యవధిలో పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం షరతు విధించింది. పవర్ ప్రాజెక్ట్ పనుల విలువ 3,216.11 కోట్ల రూపాయలు. దీనిని 58 నెలల వ్యవధిలో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈనెల 21 వరకు టెండర్లు స్వీకరించారు. వచ్చేనెల ఒకటో తేదీ లోగా టెక్నికల్, కమర్షియల్ క్వాలిఫికేషన్ క్రైటేరియాపై సమీక్ష నిర్వహిస్తారు. ప్రీ బిడ్ సమావేశానికి 8 సంస్థలు హాజరయ్యాయి. ఈ నెల 13వ తేదీన జలవనరుల శాఖ అధికారులతో పటేల్ ఇంజనీరింగ్, షాంఘై ఎలక్ట్రిక్ మెషినరీ, మేఘా ఇంజనీరింగ్, రిత్విక్ ప్రాజెక్ట్స్, బేకం ఇన్‌ఫ్రా లిమిటెడ్, జీఈ పవర్ ఇండియా సంస్థలు భేటీ అయి ప్రాజెక్ట్ వివరాలు తెలుసుకున్నాయి. అయితే ఈ నెల 21వ తేదీతో టెండర్ల ప్రక్రియ ముగిసే నాటికి మేఘా ఇంజనీరింగ్ సంస్థ ఒక్కటే టెండర్ దాఖలు చేసింది. రివర్స్ టెండరింగ్ విధానంలో కనీసం రెండు సంస్థలు బిడ్ వేయాలని గతంలో ప్రభుత్వం ఇచ్చిన జీవోలో నిబంధన విధించారు. ప్రస్తుతం మేఘా సంస్థ ఒక్కటే
టెండర్ దాఖలు చేయటంతో ఏం చేయాలనే విషయమై అధికారులు మల్లగుల్లాలు పడ్డారు. అయితే ఐబీఎం కన్నా 12.6 శాతం తక్కువకే మేఘా సంస్థ కోట్ చేయటంతో ఆ సంస్థకు పనులు అప్పగించవచ్చని ప్రభుత్వం స్పష్టం చేయటంతో మేఘా సంస్థకు టెండర్ ఖరారు చేశారు. ఇలాఉంటే గత కొద్ది రోజుల క్రితం పోలవరం 65వ ప్యాకేజీలో రివర్స్ టెండరింగ్ ప్రక్రియ ద్వారా 58.53 కోట్లు ఆదా అయిందని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.