ఆంధ్రప్రదేశ్‌

తీరప్రాంత భద్రతపై అప్రమత్తం కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: సముద్ర తీరం ఉన్న వివిధ రాష్ట్రాలు భద్రతపై నిరంతరం అప్రమత్తతతో వ్యవహరించాలని కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ ఆదేశించారు. తీరప్రాంతంలో పొంచి ఉన్న ముప్పుపై సోమవారం ఢిల్లీ నుండి వివిధ తీరప్రాంత రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు, పోలీస్ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సముద్రంలో చేపలవేట సాగించే వివిధ మోటారు బోట్లు, ఇతర మరపడవల నియంత్రణను సంబంధిత శాఖలు పటిష్ట నిఘాతో పర్యవేక్షించాలన్నారు. బోట్ల ద్వారా చేపలవేట సాగించే మత్స్యకారులందరికీ గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని సూచించారు. తీరప్రాంత రక్షణ, నౌకాదళం, రాష్ట్ర పోలీస్, స్థానిక యంత్రాంగాలు తీరప్రాంత భద్రత విషయంలో పూర్తి సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. తీరప్రాంత రాష్ట్రాలన్నీ మారిటైమ్ బోర్డులను ఏర్పాటు చేసి సముద్రం నుండి ఎదురయ్యే ముప్పును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలని ఆదేశించారు. అంతకు ముందు ఆయన సముద్రంలో చేపలవేట సాగించే బోటులకు సాటిలైట్ బేస్డ్ ట్రాన్స్‌పాండర్ల ఏర్పాటు, సముద్రంపై జరిగే నేరాల నియంత్రణలో నేవీ, తీరప్రాంత రక్షణ దళాలు చేపట్టాల్సిన పరిష్కార మార్గాలపై దిశానిర్దేశం చేశారు. సముద్రంలో చేపలవేట సాగించే మత్స్యకారులందరికీ బయోమెట్రిక్ గుర్తింపు కార్డుల జారీ, గుజరాత్ రాష్ట్రంలో ద్వారక వద్ద నేషనల్ అకాడమీ ఆఫ్ కోస్టల్ పోలీసింగ్ కేంద్రం ఏర్పాటుపై చర్చించారు. తీరప్రాంత రాష్ట్రాల్లో మర్చంట్ షిప్పింగ్ చట్టంలో సవరణలు, మత్స్యకారులు చేపలవేటకై ప్రవేశించే మార్గాలు, నిష్క్రమణ పాయింట్లు, భారత రక్షణ శాఖ నిర్వహించిన కోస్టల్ డిఫెన్స్ ఎక్సర్‌సైజ్ (సీవీజీఎల్) తదితర అంశాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటికే మారిటైం బోర్డును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దీన్ని మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు వీలుగా భద్రతా దళాలకు చెందిన కొంతమందిని సభ్యులుగా తీసుకోవాల్సి ఉందన్నారు. తీరప్రాంత రక్షణలో భాగంగా రాష్ట్రానికి తొలివిడతగా 18 ఇంటర్ సెప్టర్ బోట్లను కేటాయించారని వాటికి వార్షిక మరమ్మతులు అవసరమన్నాని వివరించారు. వీటి నిర్వహణను విశాఖపట్నంలోని తూర్పు నావికాదళానికి అప్పగించాలని ప్రతిపాదించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డీజీపీ గౌతం సవాంగ్, శాంతి భద్రతల అదనపు డీజీపీ రవిశంకర్ అయ్యన్నార్, తీరప్రాంత ఐజీ ఏఎస్ ఖాన్, డీఎస్పీ ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.
*చిత్రం...వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న సీఎస్ సుబ్రహ్మణ్యం, డీజీపీ సవాంగ్, అడిషనల్ డీజీపీ అయ్యన్నార్