ఆంధ్రప్రదేశ్‌

మహారాష్ట్ర నుండి ఉల్లి దిగుమతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 23: మహారాష్ట్ర నుండి ఉల్లి దిగుమతి చేసుకుని సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను రాష్ట్ర మార్కెటింగ్, మత్స్యశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ ఆదేశించారు. ఉల్లి ధరలపై సోమవారం అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించి ధరల పెరుగుదలపై ఆరా తీశారు. ఇటీవల సంభవించిన వరదలు, భారీ వర్షాల మూలంగా రాష్ట్రంలో పంట దెబ్బతిందని అందువల్ల ధరలు పెరిగాయని అధికారులు వివరించారు. ఈ పరిస్థితిని అనుకూలంగా మలచుకుని కొంతమంది వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని వారిపై చర్యలు తీసుకోవాలని మంత్రి మోపిదేవి ఆదేశించారు. బుధ, గురువారాల నుండి మహారాష్ట్ర నుంచి దిగుమతులు ప్రారంభించాలని రైతు బజార్లలో వినియోగదారులకు అందుబాటు ధరల్లో పంపిణీ చేయాలని సూచించారు.