ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్రంలో పంట సాగుదారుల హక్కుల చట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 23: రాష్ట్రంలో పంట సాగుదారుల హక్కుల చట్టం అమలుకు వీలుగా నోటిఫికేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం జారీ చేసింది. 11 నెలలకు సంబంధించి భూ యజమాని, సాగుదారు ఒప్పందం కుదుర్చుకోవాలి. గ్రామ సచివాలయంలోని విలేజ్ రెవెన్యూ అధికారి సమక్షంలో ఈ ఒప్పందం చేసుకోవాలి. పంట సాగుదారు హక్కుల కార్డు ఆధారంగా ఈ ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఒప్పందం కుటుంబ సభ్యుల మధ్య చెల్లదు. భూ యజమాని, సాగుదారు మధ్య మాత్రమే ఈ ఒప్పందం చెల్లుబాటు అవుతుంది. భూ యజమాని వీడియో ద్వారా కూడా తన అనుమతి తెలియచేయవచ్చు. వీడియోను, ఒప్పందం ప్రతిని గ్రామ సచివాలయంలో భద్రపరుస్తారు. వివిధ ఆర్థిక సంస్థల నుంచి సాగుదారు రుణాలను పొందేందుకు వీలు కలుగుతుంది. పంట బీమా, ఇన్‌పుట్ రాయితీ, పంట నష్టం వంటివి సాగుదారుకు వర్తిస్తాయి.