ఆంధ్రప్రదేశ్‌

బడుగు, బలహీనవర్గాలు ఎంత మంది?: పంచుమర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, సెప్టెంబర్ 23: టీటీడీ బోర్డు విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి తీసుకున్న నిర్ణయంపై రాష్టవ్య్రాప్తంగా ప్రజలు చర్చించుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పంచుమర్తి అనూరాధ అన్నారు. 1932లో ప్రారంభమైన టీటీడీ బోర్డు ఎంతో చరిత్ర ఉందని, కోట్లాది మంది భక్తుల మనోభావాలను ప్రతిబింబించేలా బోర్డు ఉండాలని సూచించారు. సోమవారం గుంటూరులో విలేఖర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ చంద్రబాబు హయాంలో 20 మందిలోపే బోర్డు సభ్యులను నియమిస్తే, జగన్ నేడు 36 మందిని నియమించారని, ఈ హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. కేసీఆర్, జగన్మోహనరెడ్డి బినామీల చిట్టా మాదిరిగా బోర్డు ఉందన్నారు. బోర్డులో బడుగు బలహీన వర్గాలకు 50 శాతం రిజర్వేషన్లంటున్న జగన్ 36 మందిలో ఎంతమంది బీసీలు, బడుగు బలహీనవర్గాలకు ప్రాధాన్యత ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు.