ఆంధ్రప్రదేశ్‌

నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటుపై టాస్క్ ఫోర్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 23: ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో నైపుణాభివృద్ధి కేంద్రాల ఏర్పాటుకు వీలుగా ప్రళాళిక సిద్ధం చేసేందుకు ఒక టాస్క్ఫోర్సును రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఏర్పాటు చేసింది. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈ టాస్క్ఫోర్సును ఏర్పాటు చేసింది. దీనికి చైర్మన్‌గా ముఖ్యమంత్రి, కో-చైర్మన్‌గా విద్యా శాఖ మంత్రి, కన్వీనర్‌గా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వ్యవహరిస్తారు. ఇప్పటికే రాష్ట్రంలో అమలు జరుగుతున్న నైపుణ్య శిక్షణను సమగ్రంగా పరిశీలిస్తుంది. శిక్షణలో లోపాలను గురించి, వీటిని అధిగమించేందుకు తగిన సిఫారసులు చేయాల్సి ఉంటుంది. శిక్షణకు సంబంధించి శిక్షణ, వసతులు, కెరీర్ కౌనె్సలింగ్‌కు అవసరమైన ప్రణాళిక తయారు చేస్తుంది. కళాశాలల్లో, వర్సిటీల్లో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ల ఏర్పాటు అవసరమైన సాంకేతిక, ఆర్థిక అంశాలను అంచనా వేస్తుంది.