ఆంధ్రప్రదేశ్‌

నెహ్రూ దూరదృష్టితోనే భారత్‌లో కాశ్మీర్ అంతర్భాగమైంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 23: కాశ్మీర్ సమస్యకు దేశ ప్రథమ ప్రధాని నెహ్రూయే కారణమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించడం ఆయన అజ్ఞానానికి నిదర్శనమని పీసీసీ ఉపాధ్యక్షుడు ఎన్ తులసిరెడ్డి విమర్శించారు. నెహ్రూ రాజనీతిజ్ఞత, దూరదృష్టి వల్లనే భారత్‌లో కాశ్మీర్ అంతర్భాగమైందని, లేకుంటే మొత్తం పాకిస్తాన్‌లో కలిసిపోయి ఉండేదన్నారు. నెహ్రూ దూరదృష్టితో ఆర్టికల్ 370 తాత్కాలికమని, భారత రాష్టప్రతి ఎప్పుడైనా రద్దు చేయవచ్చని రాజ్యాంగంలో పేర్కొన్నారన్నారు. అందువల్లనే ఈనాడు ఆర్టికల్ 370 రద్దుకు అవకాశం కలిగిందన్నారు. ఇలాఉంటే గోదావరి మిగులు జలాలపై తెలంగాణా సీఎం కేసీఆర్‌తో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ చర్చలు జరపడం చారిత్రిక తప్పిదమవుతుందని తులసిరెడ్డి విమర్శించారు. తెలంగాణా భూభాగం నుంచి దాదాపు 400 కి.మీ మేర గోదావరి జలాలు తరలింపు కేవలం ఖర్చు మినహా శ్రీశైలానికి రావడం ఒట్టి మాటేనన్నారు. 400 కి.మీ పరిధిలోని తెలంగాణా ప్రజలు తాము వాడుకున్న తరువాతే కిందకు అనుమతిస్తారని, చివరకు వచ్చేవరకు చుక్కనీరు కూడా మిగలదన్నారు. గోదావరి జలాలు ఆంధ్ర భూభాగం నుంచి తరలించే అవకాశం ఉండగా, తెలంగాణా నుంచి తరలించడమేమిటని ప్రశ్నించారు.