ఆంధ్రప్రదేశ్‌

డిసెంబర్ నాటికి భూరికార్డులు డిజిటలైజేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, సెప్టెంబర్ 23: కేంద్ర ప్రభుత్వం భూ రికార్డుల డిజిటలైజేషన్‌కు దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌కు పూర్తిస్థాయి అనుమతి ఇస్తూ నిధులు కేటాయించిందని, డిసెంబర్ నెలాఖరులోగా భూములకు సంబంధించిన రికార్డుల డిజిటలైజేషన్ పూర్తి చేయాలని రాష్ట్ర భూ, దేవాదాయ, విపత్తుల నిర్వహణ, సిసిఎల్‌ఏ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ మన్మోహన్ సింగ్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. సోమవారం సాయంత్రం ఆయన తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయం నుంచి రాష్ట్రంలోని వివిధ జిల్లాల జాయింట్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాల నిర్వహణకు చేపట్టాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్టోబర్ 3వ తేద నుంచి గ్రామ సర్వేయర్లురెసిడెన్షియల్ శిక్షణ అర్థవంతంగా 30 రోజులు ఇవ్వాలని అన్నారు. శిక్షణ ఒకే చోట కాకుండా వివిద ప్రాంతాల్లో ఇవ్వాలని దీనికి పర్యవేక్షణాధికారులుగా ఆర్‌డిఓ, సబ్ కలెక్టర్లతో పాటుగా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లను నియమించాలని సూచించారు. శిక్షణ అనంతరం ఆటో కాడ్, ఎలక్ట్రానిక్ రికార్డులపై శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. అన్ని తహశీల్దార్ కార్యాలయాల్లో ఆధునిక రికార్డు రూమ్‌లు ఏర్పాటు ఇప్పటికే ప్రతి జిల్లాలో 8 మండలాల్లో ఏర్పాటు చేయాలని చెప్పామన్నారు. కేంద్రం ప్రాజెక్టు మేనేజ్‌మెంట్ శాంక్షన్ సిస్టమ్ 100 శాతం చేయాలని స్పష్టం చేశారు. ప్రతి భూ రికార్డు స్కానింగ్ చేసి ఎలక్ట్రానిక్ రూపంలోకి డిసెంబర్‌లోపు పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. సర్వే జరిగే సమయం ప్రతి రైతుకు తెలిసేలా ప్రచారం చేపట్టాలని ఆయన స్పష్టం చేశారు. రైతులు స్వచ్చంధంగా తమ భూమిని నమోదు చేసుకునేలా ఉండాలని ఆ సమయంలో గతంలో జరిగిన పొరబాట్లు దిద్దుకునే అవకాశం వారికి కలుగుతుందని అన్నారు. అక్టోబర్ 2 నుంచి గ్రామ సచివాలయ వ్యవస్థ ప్రారంభం కానుందని రాష్ట్ర వ్యాప్తంగా 11,158 మంది గ్రామ సర్వేయర్లు విధుల్లో చేరనున్నారని అన్నారు. ఇందులో శ్రీకాకుళం 835, విజయనగరం 664, విశాఖపట్నం 739, తూర్పు గోదావరి 1271, పశ్చిమగోదావరి 938, కృష్ణ 845, గుంటూరు 872, ప్రకాశం 884, నెల్లూరు 665, చిత్తూరు 1035, కడప 633, కర్నూలు 881, అనంతపురం 896 మంది కలిపి మొత్తం 11,158 మంది అక్టోబర్ 2న విధుల్లో చేరునున్నారని మన్మోహన్ సింగ్ చెప్పారు. ఇంటి పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్న అర్హుతగల లభ్దిదారుల జాబితాను ఈనెల 30వ తేదీలోగా సిద్ధం చేయాలని చెప్పారు. అదే రోజు సిఎం నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్‌కు వివరాలు అందించాల్సి ఉంటుందన్నారు. సోమవారం నుంచి అప్‌లోడ్ నిలిపివేస్తున్నామని, తిరిగి పరిశీలించాల్సిన 13.80 లక్షల మంది లబ్ధిదారుల జాబితాను జిల్లాలకు పంపామని, వీటిని అధికారులు బాధ్యతతో క్షేత్రస్థాయిలో పరిశీలించాలని అన్నారు. ఇంటి పట్టాలకు కావాల్సిన భూసేకరణకు ప్రాథమికంగా గ్రామీణ ప్రాంతాలకు 30వేల ఎకరాలు, పట్టణ ప్రాంతాలకు 4,200 ఎకరాలు అవసరమని గుర్తించినా , అవి నివాస యోగ్యమైన స్థలంగా జిల్లా కలెక్టర్లు ధ్రువీకరించాల్సి ఉంటుందన్నారు. అవసరమైతే ఏపిఐఐసి, నెడ్‌క్యాప్ భూములను తీసుకోవాలని ఆయన తెలిజేశారు. ఆర్‌టిజిఎస్ సహకారంతో అర్హులను గుర్తించాలని స్పష్టం చేనశారు. కౌలుదారుల హక్కుచట్టం 2019 మేరకు వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య సూచనల మేరకు గ్రామ సభల్లోనే కౌలుదారుల గుర్తింపు ప్రధామని స్పష్టం చేశారని, అప్పుడే రైతు భరోసాకు అర్హులు అవుతారని చెప్పారు. ప్రతి గ్రామ సచివాలయంలో కౌలుదారుల హక్కుచట్టం 2019 ప్రచార సామగ్రిని అందుబాటులో ఉంచాలని అన్నారు. స్పందన అర్జీల పరిష్కారి ఎప్పటికప్పుడు చేపట్టాలని ప్రతి అర్జీని క్షుణ్ణంగా చదవాలన్నారు. తిరుపతి సబ్‌కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ మార్కండేయులు, తిరుపతి ఆర్డీఓ కనకనరసా రెడ్డి కూడా పాల్గొన్నారు.