ఆంధ్రప్రదేశ్‌

పేపర్ లీకేజీపై రహస్య విచారణ నిజం కాదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (సిటీ), సెప్టెంబర్ 22: లక్షల మంది నిరుద్యోగుల ఆశలపై నీళ్లు జల్లి, గ్రామ సచివాలయం పరీక్ష పేపర్ లీకేజీ అంశంలో నైతిక బాధ్యత వహించి సీఎం జగన్ రాజీనామా చేయాలని మాజీ మంత్రి నారా లోకేష్ డిమాండ్ చేశారు. గత టీడీపీ పాలనలో జరగని పేపర్ లీకేజీపై నానారభస చేసింది గుర్తుందా? అంటూ ఆదివారం ట్విట్టర్ వేదికగా సీఎం జగన్‌ను ట్యాగ్ చేస్తూ ప్రశ్నించారు. దానిపై అప్పట్లో జరిగిన విచారణలో కూడా పేపర్ లీకేజీ జరగలేదని తేలిందన్నారు. కానీ జగన్.. పత్రిక ప్రభుత్వంపై ఎలా విషం చిమ్మిందో ఒకసారి గుర్తుకు తెచ్చుకోండంటూ గుర్తుచేశారు. ఇదే అంశంపై సీఎం రాజీనామా చేయాలి, సీబీఐ విచారణ చెయ్యాలని డిమాండ్ చేయలేదా? మరిప్పుడు జరిగిన పేపర్ లీకేజీపై మీరేం చేద్దామనుకుంటున్నారు? అని నిలదీశారు. పేపర్ లీకేజీ స్కామ్ బయటికి రాకుండా మీరు రహస్య మంతనాలు జరపలేదా అని నిలదీశారు. మరిప్పుడు మీరు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేస్తున్నారా, లేదా? అంటూ ప్రశ్నించారు.