ఆంధ్రప్రదేశ్‌

సచివాలయ ఉద్యోగాల భర్తీపై ఉలుకెందుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 22: రాష్ట్ర చరిత్రలోనే కనీవినీ ఎరుగని మెజారిటీతో అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు తిరక్కముందే లక్షా పాతిక వేల మందితో ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీచేస్తే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్కసు వెళ్లబోసుకుంటున్నారని ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల నాని, పాముల పుష్పశ్రీవాణి, నారాయణస్వామి, అంజాద్ బాషా ధ్వజమెత్తారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి చంద్రబాబు రాసిన బహిరంగ లేఖకు వారు కౌంటర్ ఇచ్చారు. అది బరితెగింపు లేఖలా ఉందని విమర్శించారు. టీడీపీ ఐదేళ్ల పాలనలో ఉద్యోగ నియామకాలు ఎందుకు జరపలేదని ప్రశ్నించారు. ప్రతి గ్రామంలో 10మంది యువతకు ఉద్యోగాలు వస్తుంటే టీడీపీ కాలగర్భంలో కలిసిపోతుందనే భయంతోనే అభాండాలు వేస్తున్నారని ఆక్షేపించారు. ఈమేరకు చంద్రబాబుకు ఆదివారం వారు బహిరంగ లేఖ రాశారు. తాబేదార్లతో దుష్ప్రచారం చేయిస్తూ చంద్రబాబు బహిరంగ లేఖలు రాస్తున్నారని మండిపడ్డారు.
రెక్కలు ముక్కలు చేసుకుని పిల్లల్ని చదివించిన సగటు కుటుంబాల్లోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, పేద, మధ్యతరగతి వర్గాల వారి జీవితాల్లో ఈ ఉద్యోగాలతో ప్రభుత్వం వెలుగులు నింపుతోందని తెలిపారు. గ్రామ సచివాలయ పోస్టుల్లో ఏ కేటగిరీ చూసినా ఈ వర్గాల వారు పోటీ తత్వంతో పరీక్షలు రాశారని వివరించారు. ‘ప్రభుత్వ నిర్వహణ క్లిష్టతరమని, సవాళ్లతో కూడుకున్నదని మీ అనుభవానికి మీరే భుజాలు తడుముకున్నారు. దోపిడీలు, వెన్నుపోట్లు, కులపిచ్చిలో మీకున్న అనుభవం గొప్పది. సమాజాన్ని వర్గపోరుతో విడదీయటంలో మీకు మీరే సాటి’ అని లేఖలో చంద్రబాబుపై వారు ధ్వజమెత్తారు. మీ పాలనా అనుభవం ఏపాటిదో ప్రజలే ఎన్నికల్లో తేల్చారన్నారు. గ్రామ సచివాలయ పరీక్షలు కచ్చితంగా పారదర్శకంగా జరిగాయని స్పష్టం చేశారు. ఉద్యోగాలను అమ్ముకోవటం, చేతివాటం కర్షక పరిషత్ అధ్యక్షునిగా ఉన్నప్పటి నుంచి చంద్రబాబుకు అలవాటేనని విమర్శించారు. స్టాంప్ పేపర్లు, దొంగనోట్ల కుంభకోణం, యూరో లాటరీ స్కాం మొదలు ఇంటర్మీడియట్, ఎంసెట్ ప్రశ్నపత్రాల లీకేజీ వరకు ఆయన చరిత్ర తవ్వినకొద్దీ బయటపడుతుందన్నారు. గ్రామ వలంటీర్ల వ్యవస్థ ‘దోపిడీ జన్మభూమి’ లాంటిది కాదన్నారు. ఏపీపీఎస్సీని భ్రష్టుపట్టించిన చరిత్ర ఉన్న చంద్రబాబుకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పినా ఆయనలో మార్పురాలేదని విమర్శించారు. ప్రభుత్వ సర్వీస్‌లను డోర్ డెలివరీ చేసినందుకు వలంటీర్లకు ఇచ్చేది పారితోషికం మాత్రమేనని, కష్టపడేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు కూడా సిద్ధంగా ఉన్నారన్నారు. అప్పనంగా తిని కూర్చునేందుకు అలవాటుపడిన టీడీపీ కార్యకర్తలు వలంటీర్లుగా ఎలా పనిచేస్తారని నిలదీశారు. సచివాలయ పరీక్షల్లో టాపర్లుగా నిలిచిన వారికీ, మీ కుమారుడు లోకేష్‌కు మధ్య పోటీ పరీక్ష పెట్టేందుకు సిద్ధమేనా? అని సవాల్ విసిరారు. ప్రజాజీవితంలో నాయకుడికి ఉండాల్సింది అనుభవం ఒక్కటే కాదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వంపై అభాండాలు వేయటం మానుకోవాలని హితవు పలికారు.