ఆంధ్రప్రదేశ్‌

36 మందికి చోటెలా కల్పించేది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, సెప్టెంబర్ 22: తిరుమల తిరుపతి దేవస్థానముల ధర్మకర్తల మండలిలో 36 మందితో కమిటీ ఏర్పాటు కావడంతో సమావేశం నిర్వహణ సందర్భంగా అన్నమయ్య భవన్‌లో వారికి చోటు ఎలా కల్పించాలా అని టీటీడీ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశాలు అన్నమయ్య భవన్‌లో నిర్వహిస్తుంటారు. అయితే గతంలో సభ్యుల సంఖ్య 20కి మించకుండా వుండటంతో అప్పట్లో సమావేశానికి ఒక రౌండ్‌టేబుల్‌ను ఇంజినీరింగ్ విభాగం ఏర్పాటు చేసింది. అయితే తాజాగా పాలకమండలి సభ్యులు సంఖ్య 36కి పెరిగింది. వీరందరికీ ఒకే వరుసలో సమాన స్థానం కల్పించాలంటే అన్నమయ్య భవన్‌లో వున్న విస్తీర్ణం సరిపోదు. కనీసం ప్రత్యేక ఆహ్వానితులను వెనుక కూర్చోబెట్టాలని భావిస్తే అందులో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, మాజీ బోర్డు సభ్యుడు శేఖర్‌రెడ్డిలతో పాటు అనేక మంది పారిశ్రామిక వేత్తలు వున్నారు. వీరి గౌరవానికి భంగం కల్గించకుండా ఏర్పాట్లపై అధికారులు దృష్టిసారిస్తున్నట్లు సమాచారం. టీటీడీ ధర్మకర్తల మండలిని ఏర్పాటు చేయడానికి సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సుదీర్ఘకాలం కసరత్తు చేయాల్సి వచ్చిన సంగతి పాఠకులకు విదితమే. ప్రస్తుతం సముచిత స్థానం కల్పించడానికి టీటీడీ అధికారులు కూడా దాదాపు అలాంటి కసరత్తు చేయాల్సిన పరిస్థితి ఎదరురయ్యింది. ఇదిలావుండగా సోమవారం నాడు దాదాపు 25 మంది సభ్యులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. వెంటనే అన్నమయ్య భవన్‌లో సామావేశం కానున్నారు. ఇదిలావుండగా ఇక్కడ మరో సమస్యకూడా ఉత్పన్నం అవుతోంది. ఈ సమస్యను కూడా అధిగమించడానికి టీటీడీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. 25 మంది సభ్యులు ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో ఎవరికి వారి తమ బంధు మిత్రులను కూడా వెంటతీసుకువస్తారు. ఒక్కో బోర్డు సభ్యుడు కనీసం 40 మందిని వెంటబెట్టుకువచ్చినా 1000 మంది అవుతారు. వీరందరినీ బంగారువాకిలిలో ఉంచడం అసాధ్యమే. ఒక్కో సభ్యుని ప్రమాణస్వీకార కార్యక్రమం కూడా ఒక నిమిషం పాటు చేసినా అరగంట పాటు ప్రమాణస్వీకారానికి సమయం కేటాయించాల్సి ఉంటుంది. ఇది సామాన్య భక్తులకు కొంత అసౌకర్యం ఏర్పడే అకాశం ఉంది. అలా కాకుండా మూకుమ్మడిగా సభ్యులచేత ప్రమాణస్వీకారం చేయించాలని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా ప్రమాణస్వీకారం చేసిన వారందరికీ రంగనాయక మండపంలో వేద ఆశీర్వచనం పలకాలి. వీరందరికీ వేర్వేరుగా ఆశీర్వాదం పలికి, వారి తీర్థ ప్రసాదాలు అందించాలంటే సుమారు రెండు గంటలు సమయం పట్టే అకాశం ఉంది. దీంతో ఇక్కడ కూడా అందరికీ ఒకేసారి ఆశీర్వచనం చేయాలనే ఆలోచనతో అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో సభ్యుల వెంట వచ్చిన బంధు మిత్రులు రంగనాయక మండపంలో ప్రవేశిస్తే అక్కడ అందరూ కూర్చోడానికి వీలుకాని పరిస్థితి ఉంది. మొత్తం మీద ఈ జంబో పాలకమండలిని నియంత్రించే సవాలను అధికారులు ఎలా అధిగమిస్తారనేది ఆసక్తిగా మారింది. ఇదిలా వుండగా సోమవారం నాడు జరుగనున్న తొలి సమావేశంలో చర్చించడానికి ఇప్పటికే 194 సబ్జెక్టులతో అజెండాను కూడా అధికారులు సిద్ధం చేశారు. ప్రధానంగా 150 కోట్ల రూపాయలతో అమరావతిలో గత ప్రభుత్వం నిర్మింపతలపెట్టిన శ్రీవారి ఆలయానికి సంబంధించిన అంశాన్ని చర్చించనున్నారు. ఇప్పటికే ఆలయ నిర్మాణ వ్యయాన్ని గణనీయంగా తగ్గించాలని ముఖ్యమంత్రి, టీటీడీ చైర్మన్ నిర్ణయానికి వచ్చిన విషయం విదితమే. ఇక అన్యమతస్థులు టీటీడీలో పనిచేస్తున్నారని వచ్చిన వార్తలపై కూడా తొలిసమావేశంలో చర్చిస్తారా?లేదా? అనేది కూడా ఆసక్తిగా మారింది. అలాగే ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులను తిరిగి ఒఎస్‌డి రూపంలో విధుల్లోకి తీసుకునే అంశం చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇదిలావుండగా దేశంలోనే ఎంతో గుర్తింపు పొందిన బర్డ్ హాస్పిటల్‌కు పూర్తిస్థాయి డైరెక్టర్ లేని పరిస్థితి కొనసాగుతోంది. బర్డ్ డైరెక్టర్‌గా వున్న డాక్టర్ జగదీష్ కొద్ది నెలల క్రితం ఉద్యోగ విరమణ పొందారు. అప్పటి నుంచి ఇన్‌ఛార్జి డైరెక్టర్‌గా ఉద్యోగ విరణమణ పొంది, తిరిగి ఓ ఎస్‌డిగా పనిచేస్తున్న డాక్టర్ వెంకారెడ్డి డైరెక్టర్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఇలా కాకుండా పూర్తి స్థాయి డైరెక్టర్‌ను ఏర్పాటు చేయాలని టీటీడీ చైర్మన్ భావిస్తున్నారు. అయితే డాక్టర్ జగదీష్‌ను తిరిగి విధుల్లోకి తీసుకుంటారా? లేక రుయా ఆస్పత్రిలో ఆర్థో విభాగాధిపతిగా పనిచేస్తున్న శ్రీనివాసులరెడ్డిని నియమిస్తారా? అన్నది బర్డ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వీరితో పాటు కొన్ని సాధారణ పరిపాలనకు సంబంధించిన అంశాలు సోమవారం నాడు జరిగే టీటీడీ బోర్డు సమావేశంలో చర్చకు రానున్నట్లు తెలుస్తోంది.