ఆంధ్రప్రదేశ్‌

విశాఖ మన్యంలో ఎదురుకాల్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీలేరు, సెప్టెంబర్ 22: విశాఖ మన్యం మళ్ళీ రక్తసిక్తమైంది. జీకే వీధి మండలం మాదిగమల్లు-అన్నవరం అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో గాలికొండ ఏరియా కమిటీ కార్యదర్శి హరితో పాటు మరో ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి చెందారు. ఆదివారం ఉదయం 11-12 గంటల మధ్య ఈ ఎదురుకాల్పలు సంఘటన చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం వివరాలివి. మావోయిస్టుల గాలింపు చర్యల్లో భాగంగా ఆదివారం గ్రేహౌండ్స్ పోలీసులు జీకే వీధి మండలం అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తుండగా మాదిగమల్లు- అన్నవరం అటవీ ప్రాంతంలో కొండపై నుండి 21 మంది మావోయిస్టులు కిందకు దిగుతున్నట్టుగా గుర్తించిన సాయుధ పోలీసులు కాల్పులకు దిగారు. దీంతో అప్రమత్తమైన మావోయిస్టులు సైతం ఎదురుకాల్పులు
జరిపారు. ఈ ఘటనలో గాలికొండ ఏరియా కమిటీ కార్యదర్శి హరి, మరో ముగ్గురు మహిళా మావోయిస్టులు పోలీసు తూటాలకు బలయ్యారు. ఇరువర్గాల మధ్య ఎదురుకాల్పులు కొనసాగడంతో మిగిలిన మావోయిస్టులు పరారయ్యారు.
అనంతరం సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడ ఉన్న 303 వెపన్ 1, 12 బోర్ తుపాకులు రెండు, ఎస్‌ఎల్‌ఆర్ తుపాకీ 1 స్వాధీనం చేసుకున్నారు. ఎదురుకాల్పుల్లో మృతి చెందిన ఇద్దరు మహిళా మావోయిస్టులు ఎవరనేది తెలియరాలేదు. మారుమూల అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరగడంతో మృతదేహాలను తీసుకురావడం పోలీసులకు కష్టసాధ్యంగా మారింది. మృతదేహాల కోసం దారకొండ , సీలేరు పోలీసులు అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచారు. ఎదురుకాల్పుల సంఘటన నుండి తప్పించుకున్న మావోయిస్టుల కోసం పోలీసు బలగాలు అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి. గాలికొండ దళానికి చెందిన నవీన్ ఇటీవల పోలీసుల ఎదుట స్వచ్ఛందంగా లొంగిపోయాడు. అదే సమయంలో హరి కూడా లొంగిపోవాలని నిర్ణయించుకున్నప్పటికీ ఆఖరి నిమిషంలో మళ్ళీ మనస్సు మార్చుకుని దళంలోకి వెళ్ళిపోయినట్టు చెబుతున్నారు. నవీన్‌తో పాటు లొంగిపోయి ఉంటే ఆదివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో హరి ప్రాణాలు కోల్పోయి ఉండేవాడు కాదని స్థానికులు చెబుతున్నారు.

*చిత్రం...ఎదురుకాల్పులు జరిగిన సంఘటనా స్థలంలో గాలిస్తున్న భద్రతా దళాలు