ఆంధ్రప్రదేశ్‌

జమ్మూ కాశ్మీర్ విభజన రాజ్యాంగ ఉల్లంఘనే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 22: జమ్మూకశ్మీర్ రాష్ట్ర ప్రతిపత్తిని రద్దు చేయడం, రెండు భాగాలుగా విభజించడం పూర్తిగా రాజ్యాంగాన్ని ఉల్లంఘించటమేనని కేంద్ర సమాచార హక్కు చట్టం మాజీ కమిషనర్ ప్రొఫెసర్ మాడభూషి శ్రీ్ధర్ అన్నారు. నగరంలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం జరిగిన సదస్సులో ‘370వ అధికరణం - కశ్మీర్ సమస్య’పై ఆయన ప్రసంగించారు. రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు, ఐలు రాష్ట్ర అధ్యక్షుడు సుంకర రాజేంద్రప్రసాద్ అధ్యక్షత వహించారు. స్వాతంత్య్రానంతరం 652 సంస్థానాల విలీనం సమయంలో జమ్మూకశ్మీర్ సంస్థానం పాకిస్తాన్‌లో కలవడమా? భారత యూనియన్‌లో కలవడమా? స్వతంత్ర రాజ్యంగా కొనసాగడమా? అనే మూడు ప్రత్యామ్నాయాలు ముందుకొచ్చిన దశలో కొన్ని షరతులపై మన దేశంలో కశ్మీర్ అంతర్భాగం అయ్యిందని శ్రీ్ధర్ చెప్పారు. ఆనాడు రూపొందిన రాజ్యాంగ పరిషత్తులో సుదీర్ఘంగా చర్చించి రక్షణ, విదేశాంగ విధానం, కమ్యూనికేషన్ రంగాలు మినహా మిగతా హక్కులన్నీ కశ్మీర్ అసెంబ్లీకి ఉండేటట్లు నిర్ణయానికి వచ్చి, భారత్ యూనియన్‌తో ఒక ఒప్పందం చేసుకుందన్నారు. ఇది విలీన ఒప్పందంగా కాక అనుబంధ ఒప్పందంగా జరిగిందని ఆయన తెలిపారు. రెండు పక్షాల మధ్య జరిగిన ఒప్పందాన్ని ఉభయులు సంప్రదించుకుని మార్పులు చేసుకోవాలితప్ప ఏకపక్షంగా చేయకూడదన్నారు. కశ్మీర్ విషయంలో కేంద్ర ప్రభుత్వం దీనికి విరుద్ధంగా వ్యవహరించిందని ఆయన చెప్పారు. కనీసం రాష్ట్ర అసెంబ్లీని సంప్రదించాల్సి ఉండగా అసెంబ్లీ ఎన్నికలనే నిలిపివేశారన్నారు. కేంద్రం నియమించిన గవర్నర్ అభిప్రాయాన్ని కశ్మీర్ ప్రజల అభిప్రాయంగా చెప్పడం అత్యంత అప్రజాస్వామికమన్నారు. బీజేపీ ఎన్నికల ప్రణాళికలో పెట్టాం, మాకు పూర్తి మెజార్టీ ప్రజలిచ్చారు కాబట్టి దీన్ని అమలు చేశామని మోదీ, అమిత్ షా చెప్పడం తర్కానికి నిలవదన్నారు. జమ్మూకశ్మీర్ విభజన భారత రాజ్యాంగం, న్యాయ సూత్రాలకు పూర్తి విరుద్ధంగా జరిగిందని మాడభూషి శ్రీ్ధర్ స్పష్టం చేశారు. ఎంబీ విజ్ఞాన కేంద్రం కార్యదర్శి పీ మురళీకృష్ణ, ఆలిండియా ప్రోగ్రెసివ్ ఫోరం ఉపాధ్యక్షుడు బీ జమిందార్, అసోసియేషన్ ఆఫ్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ కన్వీనర్ పిచ్చుక శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
*చిత్రం... సదస్సులో ప్రసంగిస్తున్న మాడభూషి శ్రీ్ధర్