ఆంధ్రప్రదేశ్‌

బాబు అవినీతి బట్టబయలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, సెప్టెంబర్ 21: దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి చేపట్టిన రివర్స్ టెండరింగ్ వల్ల 300 కోట్ల రూపాయల టెండర్‌లో 50 కోట్ల రూపాయల మేర ప్రజాధనం ఆదా అయిందని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చెప్పారు. అంతేకాకుండా రివర్స్ టెండరింగ్‌తో గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవినీతి కూడా బట్టబయలైందని, చంద్రబాబు చేపట్టిన ప్రతి పనికి సంబంధించి రివర్స్ టెండరింగ్‌కు వెళ్తామని స్పష్టంచేశారు. శనివారం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో మంత్రి అనిల్‌కుమార్ పోలవరంపై మాట్లాడారు. ప్రభుత్వ ఖజానాకు పారదర్శక విధానం తీసుకురావాలనే ఉద్దేశంతో లెఫ్ట్ టనె్నల్‌కు 290 కోట్ల రూపాయల పనులకు గాను 4.77 ఎక్సెస్ వేసిన కాంట్రాక్ట్‌ను రివర్స్ టెండరింగ్‌కు తీసుకువస్తే 15.6 లెస్‌కు వేశారన్నారు. దీంతో 20.33 ఎక్సెస్‌ను తగ్గించినట్లైందన్నారు. రివర్స్ టెండరింగ్ విధానం దేశంలోనే ఆదర్శంగా నిలవబోతుందని, ఈ విధానం ద్వారా కోట్ల రూపాయల ప్రజాధనం ఆదా కానుందన్నారు. జగన్‌కు అనుకూలమైన వారికి టెండర్లు కట్టబెట్టేందుకు రివర్స్ టెండరింగ్ అంటూ చంద్రబాబు పదే పదే చెప్తున్నారని, చంద్రబాబు హయాంలో 4.7 శాతం అధికంగా టెండర్ వేసిన మ్యాక్స్ ఇన్ ఫ్రా సంస్థ ఇప్పుడు 15.6 శాతం లెస్‌కు టెండర్ వేసిందన్నారు. ఎవరైనా టెండర్ ఇవ్వాలనుకుంటే లెస్‌కు వేయిస్తారా అంటూ ప్రశ్నించారు. రివర్స్ టెండరింగ్ అంటే చంద్రబాబుకు భయమెందుకో అర్థం కావడం లేదన్నారు. టీడీపీ హయాంలో ప్రతి పని కూడా 4 శాతం అధికంగా ఎక్సెస్ టెండర్‌లు వేశారన్నారు. మా విధానంతో చంద్రబాబు, లోకేష్‌ల మాదిరిగా జేబులో వేసుకునే పరిస్థితి ఉండదని పేర్కొన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు బుద్ది తెచ్చుకుని అబద్ధపు ప్రచారాలు మానుకోవాలన్నారు. పారదర్శక విధానంతో ముందుకెళ్తుంటే తప్పుగా చిత్రీకరించే ప్రయత్నాలు కట్టిపెట్టాలన్నారు. నిజానికి పోలవరం ఎక్కడా ఆగిపోలేదని, 52 వేల కోట్ల రూపాయల పోలవరం ప్రాజెక్టులో ఇంకా పనులు పూర్తి కావాల్సి ఉందన్నారు. అలాగే ముఖ్యమంత్రి జగన్ లక్షా 25 వేల పర్మినెంట్ ఉద్యోగాలు పారదర్శకంగా ఇస్తే దానిపై కూడా చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. మీరు ఎన్ని కుట్రలు పన్నినా టీడీపీకి రాష్ట్రంలో భవిష్యత్తు లేదని, ప్రజలు శాశ్వతంగా ఇంటికి పంపించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ జోస్యం చెప్పారు.