ఆంధ్రప్రదేశ్‌

కరకట్ట ఎమ్మెల్యేగా మిగిలిన ఆర్కే : పంచుమర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 21: వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి మరిచిపోయి చంద్రబాబు నివాసంపై పడిందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పంచుమర్తి అనూరాధ విమర్శించారు. ఇక మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి (ఆర్కే) కరకట్ట ఎమ్మెల్యేగా మారారని ఎద్దేవా చేశారు. టీడీపీ కార్యాలయంలో శనివారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ చంద్రబాబు నివాసం ఉంటున్న కరకట్టపై ఆర్కే పిచ్చిపట్టినట్లు తిరుగుతున్నారన్నారు. వ్యక్తిగత కక్షతో చంద్రబాబు ఉండే నివాసానికి, కరకట్టపై ఉన్న ఇళ్లకు ఇప్పటికే మూడు సార్లు నోటీసులు ఇచ్చి ఏమి చేయాలో తెలియక బోల్తాపడ్డారన్నారు. ఇలాఉంటే టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ శివప్రసాదరావు మరణం కలిచివేసిందని, ప్రత్యేక హోదా కోసం, రాష్ట్భ్రావృద్ధి కోసం పార్లమెంట్‌లో ఎన్నో రకాలుగా ఆందోళనలు చేశారన్నారు. శివ ప్రసాదరావు ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థించారు.