ఆంధ్రప్రదేశ్‌

వంద రోజుల పాలన.. ప్చ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 18: అవినీతి రహిత పాలన అందిస్తామంటూ అధికారం చేపట్టిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మూడు నెలల కాలంలోనే ప్రజా విమర్శలు, వ్యతిరేకతకు భయపడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. విశాఖలోని బీజేపీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు వాస్తవాలు తెలుసుకుంటే ఏపీకి బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా అభివృద్ధి చేస్తుందని, ఈ నేపథ్యంలో ఒక్క బీజేపీకి మినహా ఏ రాజకీయ పార్టీకి ప్రజలను ఓటు అడిగే హక్కు లేదన్నారు. ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై మాట్లాడినా, ధర్నా, ర్యాలీ చేసినా ముందుగానే ఆరెస్టు చేసి అడ్డుకుంటున్నారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే అస్తవ్యస్త పాలనతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ భవిష్యత్‌లో ఏ విధమైన పరిపాలన అందిస్తారోనన్న భయం ప్రజల్లో నెలకొందన్నారు. మాజీ స్పీకర్ కోడెల మృతిపై అధికార, ప్రతిపక్ష పార్టీలు రాజకీయం చేయకుండా ఉంటే మంచిదన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరి గొంతూ నొక్కడం సమంజసం కాదని, వైసీపీ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ప్రసారం చేస్తున్న ఎలక్ట్రానిక్ మీడియా ఛానళ్లను రాష్ట్రంలో నిలిపివేయడం సరికాదన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో పని చేసేందుకు అధిక సంఖ్యలో దళితలు, ముస్లింలు సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రధాని మోదీ ఆదేశాల మేరకు ప్లాస్టిక్ వాడకంపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో చైతన్యం కలిగిస్తున్నామని, దివ్యాంగుల రక్షణకు బీజేపీ అండగా నిలుస్తుందన్నారు. ఈ సందర్భంగా విశాఖ జిల్లా అరుకు నియోజకవర్గానికి చెందిన సీనియర్ నాయకుడు పాంగి రాజారావు, మరో 150 మంది కార్యకర్తలు బీజేపీలోకి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సమావేశంలో మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు, పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కంభంపాటి హరిబాబు, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు, ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ పాల్గొన్నారు.
*చిత్రం...విశాఖలో మీడియాతో మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ