ఆంధ్రప్రదేశ్‌

గర్భిణిని ఒడ్డుకు చేర్చిన ఎస్‌డీఆర్‌ఎఫ్ దళాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దువ్వూరు, సెప్టెంబర్ 18: వరదను లెక్కచేయకుండా పురిటినొప్పులు వచ్చిన గర్భిణిని ఎన్‌డీఆర్‌ఎఫ్ దళాలు సురక్షితంగా గ్రామం నుంచి బయటకు తీసుకువచ్చి వైద్యం అందించాయి. ఈ సంఘటన కడప జిల్లా దువ్వూరు మండలం పెద్దజొన్నవరంలో బుధవారం జరిగింది. గత మూడురోజులుగా కర్నూలు, కడప జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కుందూనది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. కడప జిల్లా దువ్వూరు మండల పరిధిలోని కానగూడురు, జొన్నవరం, నేలటూరు గ్రామాలల్లోకి వరద నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. పెద్దజొన్నవరం గ్రామానికి చెందిన తలారి పద్మ బుధవారం పురిటినొప్పులతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు కానాల జయచంద్రారెడ్డి ఎస్‌ఐ కుళాయప్పకు తెలిపారు. ఆయన వెంటనే ఎస్‌డీఆర్‌ఎఫ్ దళాలను గ్రామానికి రప్పించారు. పద్మను మంచంపై పడుకోబెట్టి వరద నీటిలో నడుచుకుంటూ గ్రామస్తుల సాయంతో గ్రామం నుంచి గట్టుకు చేర్చారు. అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న ప్రభుత్వ వైద్యాధికారి ప్రథమ చికిత్స అందించి అంబులెన్స్‌లో దువ్వూరులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ గర్భిణికి ప్రభుత్వ వైద్యాధికారిణి సమీర పరీక్షలు నిర్వహించారు. గర్భిణిని కాపాడిన ఎన్‌డీఆర్‌ఎఫ్ దళాలు, అధికారులకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. రెస్క్యూటీమ్ వెంట తహశీల్దార్ దామోదర్‌రెడ్డి, ఆర్‌ఐ రాజరమేష్, వైద్య సిబ్బంది ఉన్నారు.
*చిత్రం...కడప జిల్లా దువ్వూరు మండలం పెద్దజొన్నవరం గ్రామం నుంచి గర్భిణిని మంచంపై తరలిస్తున్న ఎన్‌డీఆర్‌ఎఫ్ దళాలు