ఆంధ్రప్రదేశ్‌

వరదలో చిక్కుకున్న గొర్రెల కాపరిని కాపాడిన అధికారులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాగలమర్రి, సెప్టెంబర్ 18: కర్నూలు జిల్లా చాగలమర్రి మండ లం నేలంపాడు గ్రామంలో వరద నీటిలో చిక్కుకున్న గొర్రెల కాపరి నర్సయ్యను నంద్యాలకు చెందిన మత్స్యశాఖ సిబ్బంది బుధవారం రక్షించారు. గ్రామానికి చెందిన నర్సయ్య, నరసింహులు, పేతూరు, శాంసన్ కలిసి సోమవారం గొర్రెలను మేపేందుకు వక్కిలేరు నదిదాటి అవతలికి వెళ్లారు. అయితే వర్షాలకు వరద రావడంతో నలుగురు అక్కడే చిక్కుకుపోయారు. వీరికి అన్నం ఇచ్చేందుకు దావీదు, కొండయ్య, మహేశ్, వినోద్ మంగళవారం వెళ్లగా వరదల్లో వీరు సైతం చిక్కుకున్నారు. నీళ్లలో కొట్టుకుపోకుండా చెట్టు ఎక్కి ప్రాణాలు దక్కించుకున్నారు. విషయం తెలుసుకున్న రెస్క్యూ టీం వీరిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. వీరి ద్వారా గొర్రెల కాపరులు వరదలో చిక్కుకున్న విషయం తెలుసుకున్న అధికారులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. బుధవారం ఉదయం నర్సింహులు, పేతూరు, శాంసన్ నీళ్లలో ఈదుకుంటూ అతికష్టం మీద ఒడ్డుకు చేరుకున్నారు. నర్సయ్య అక్కడే ఉండడంతో అధికారులకు విషయం చెప్పారు. తహసీల్దార్ షేక్‌మొహిద్దీన్, ఎస్‌ఐ శరత్‌కుమార్‌రెడ్డి నంద్యాల నుంచి తెప్పించిన రెండు మత్స్యశాఖ తెప్పలతో వెళ్లి వరద నీటిలో చిక్కుకున్న నరసయ్యతో పాటు 20 గొర్రెలను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

*చిత్రం...గొర్రెల కాపరి నరసయ్యను రక్షించిన అధికారులు