ఆంధ్రప్రదేశ్‌

కుంభవృష్టితో జీనజీవనం అస్తవ్యస్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, సెప్టెంబర్ 18: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కురుస్తున్న భారీ, అతిభారీ వర్షాలతో గుంటూరు జిల్లా వ్యాప్తంగా జనజీవనం స్తంభించింది.
బుధవారం తెల్లవారుజాము నుండి కురిసిన వర్షంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉన్న వాగులు, వంకలు ప్రమాద స్థాయిలో పొంగి పొర్లుతుండటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పిడుగురాళ్లలోని పిల్లుట్ల రోడ్డులో బుగ్గవాగు ధాటికి తాత్కాలికంగా ఏర్పాటుచేసిన మట్టి వంతెన కొట్టుకుపోయింది. దీంతో 10 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అమరావతి మండలం దిడుగు గ్రామంలో పొలం పనులకు వెళ్లిన ఉగ్గం సామ్రాజ్యమ్మ పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృతిచెందారు. దుర్గి మండలంలోని పలు గ్రామ పంచాయతీల్లో ఉపాధి హామీ పనులు నిర్వహించుకునేందుకు వలస వచ్చిన దాదాపు 80 కుటుంబాలు భారీ వర్షాలతో నిరాశ్రయులయ్యారు. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ఇళ్లల్లోకి నీరు చేరి ప్రజలు నరకప్రాయాన్ని చూస్తున్నారు. ఇంట్లో వంట చేసుకునే పరిస్థితి కూడా లేకపోవడంతో పస్తులుండాల్సి వస్తుంది. ఇలా ఉండగా రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో పంటపొలాలు ఇంకా నీటిలోనే నానుతూ ఉరకెత్తే ప్రమాదం పొంచివుంది. దీంతో రైతులు పొలాల్లో నిలిచిన నీటిని బయటకు పంపించేందుకు నానా అగచాట్లు పడుతున్నారు. జిల్లాలో సగటున 45.4 మిల్లీమీటర్ల వర్షం కురవగా, అత్యధికంగా గుంటూరు నగరంలో 205.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే తెనాలిలో 168.4, కొల్లిపరలో 132.4, దుగ్గిరాలలో 128.6, అమరావతిలో 120.2, ప్రత్తిపాడులో 110.4, కాకుమానులో 92 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.
*చిత్రం...పిడుగురాళ్లలో బుగ్గవాగు ధాటికి కొట్టుకుపోయిన మట్టివంతెన