ఆంధ్రప్రదేశ్‌

శ్రీశైలం విద్యుత్ జనరేటర్‌లో మంటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం టౌన్, సెప్టెంబర్ 18: శ్రీశైలం కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలోని ఒకటో నెంబర్ జనరేటర్‌లో మంగళవారం అర్ధరాత్రి మంటలు చెలరేగాయి. దీంతో ఆ జనరేటర్‌లో విద్యుత్ ఉత్పాదన పూర్తిగా నిలిచిపోయింది. కుడిగట్టు కేంద్రంలో మొత్తం 7 జనరేటర్లు ఉన్నాయి. ఒక్కొక్కటి 110 మెగావాట్ల సామర్థ్యంతో 770 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. మూడు రోజుల క్రితం ఒకటో నెంబర్ జనరేటర్‌లో కూలర్ బేరింగ్ పాడైపోయింది. దీంతో పాటు యూనిట్ లోపల ఆయిల్ పూర్తిగా సరఫరా కాకపోవడంతో బ్రేక్‌ప్యాడ్స్ మధ్య వేడి పుట్టి మంటలు చెలరేగి లెడ్ పూర్తిగా కరిగిపోయింది. జెన్‌కో ఇంజనీర్ల పర్యవేక్షణ లోపంతోనే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. యూనిట్ లోపల పొగ వచ్చే సమయంలో అక్కడ ఉన్న సిబ్బంది తక్షణమే సీఓ-2 ద్వారా దానిని ఆర్పివేసే ప్రయత్నం చేశారు. శ్రీశైలం జలాశయానికి భారీగా వరదనీరు వస్తుండడంతో గేట్ల ద్వారా దిగువకు రెండు పర్యాయాలు నీటిని విడుదల చేశారు. జలాశయంలో నీరు పుష్కలంగా ఉండడంతో ఆంధ్రలోని కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రం, ఆటు తెలంగాణలోని ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేపడుతున్నారు. కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో ఈ ఏడాది రికార్డు స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేపట్టి గ్రిడ్‌కు అందించారు. లాభాల బాటలో ఉన్న తరుణంలో ప్రస్తుతం ఒక యూనిట్‌లో విద్యుత్ నిలిచిపోవడంతో మళ్లీ భారీగా నష్టం వాటిల్లే పరిస్థితి నెలకొంది. ఈ జలవిద్యుత్ కేంద్రాన్ని 1982 అక్టోబర్ 29న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రారంభించారు. ప్రస్తుతం నిలిచిపోయిన జనరేటర్‌ను బయటకు తీసి పరిశీలించాలంటే బీహెచ్‌ఈఎల్‌తో పాటు ఇతర కంపెనీలకు చెందిన నిపుణులు రావాల్సి ఉంది. జెన్‌కో ఇంజనీర్లు నష్టాన్ని అంచనా వేస్తున్నారు. 20 రోజుల పాటు ఈ జనరేటర్‌ను పునరుద్ధరించే పరిస్థితి లేదు. ఒక యూనిట్‌లో విద్యుత్పత్తి నిలిచిపోవడం ద్వారా రోజుకు రూ.20 లక్షల నష్టం వాటిల్లే అవకాశం ఉంది. 1999, 2009లో వచ్చిన వరదల వల్ల ఈ విద్యుత్ కేంద్రం పూర్తిగా నీట మునిగింది. ప్రస్తుతం ఆరు జనరేటర్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.
*చిత్రం...ఒకటో నెంబర్ యూనిట్‌లో కరిగిపోయిన లెడ్