ఆంధ్రప్రదేశ్‌

‘పల్నాటి పులి’ తొలి విగ్రహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, సెప్టెంబర్ 18: రాష్ట్ర శాసనసభ మాజీ స్పీకర్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత డాక్టర్ కోడెల శివప్రసాదరావుపై అభిమానంతో ఏకే ఆర్ట్స్ సంస్థ అధినేత అరుణ్ ప్రసాద్ వడయార్ తొలి విగ్రహాన్ని రూపొందించారు. ఈ విగ్రహాన్ని పశ్చిమ గోదావరి జిల్లా తణుకు దగ్గరలోని నత్తారామేశ్వరంలో సుందరంగా తీర్చిదిద్దారు. ఈ విగ్రహాన్ని రూపొందించిన ఆయన త్వరలోనే కుటుంబ సభ్యులకు అందించనున్నారు. గతంలో ఇదే సంస్థ ఆధ్వర్యంలో సత్తెనపల్లి పట్టణంలోని తారక రామ సాగర్‌లో ప్రస్తుతం ఉన్న 36 అడుగుల ఎన్‌టీఆర్ విగ్రహాన్ని తయారు చేసి అప్పట్లో కోడెలకు అందజేశారు. తాజాగా కోడెల మరణవార్త తెలుసుకుని తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన అరుణ ప్రసాద్ తానే స్వయంగా కోడెల విగ్రహాన్ని తయారు చేశారు.
*చిత్రం...విగ్రహానికి తుది మెరుగులు దిద్దుతున్న శిల్పి అరుణ్ ప్రసాద్