ఆంధ్రప్రదేశ్‌

సీమలో పెరిగిన భూగర్భ జలాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 18: నైరుతి రుతుపవనాల ప్రభావం, వరదలు తదితర కారణాల వల్ల రాష్ట్రంలో భూగర్భ జలాలు స్వల్పంగా పెరిగాయి. గడచిన మూడు వారాల్లో రాష్ట్రంలో సగటున 30 సెంటీమీటర్ల మేర పెరగ్గా, రాయలసీమలో 50 సెంటీమీటర్ల మేర భూగర్భ జల మట్టం పెరగడం గమనార్హం. గత కొద్ది రోజులుగా రుతుపవనాలు చురుగ్గా ఉండటం, ఎగువ రాష్ట్రాల నుంచి వస్తున్న వరద నీరు తదితర కారణాలతో భూగర్భ జలాలు పెరిగాయి.
రాయలసీమ జిల్లాల్లో ఈ ఏడాది ఆగస్టుతో పోల్చుకుంటే సగటున 48 సెంటీమీటర్ల మేర పెరిగాయి. రాయలసీమ జిల్లాల్లో ఆగస్టులో భూగర్భ జలాలు 24.18 మీటర్ల లోతులో ఉండగా, బుధవారం నాటికి 23.7 మీటర్లకు చేరుకుంది. చిత్తూరు జిల్లాలో 29.04 మీటర్ల నుంచి 28.14 మీటర్లకు (90 సెంటీమీటర్లు), కడప జిల్లాలో 28.15 మీటర్ల నుంచి 27.6 మీటర్లకు (55 సెంటీమీటర్లు), కర్నూల్ జిల్లాలో 11.78 నుంచి 11.27 మీటర్లకు (51 సెంటీమీటర్లు)కు తగ్గింది. అనంతపురం జిల్లాలో మాత్రం 27.75 మీటర్ల నుంచి మరో రెండు సెంటీమీటర్ల మేర లోతుకు వెళ్లడం గమనార్హం. కోస్తా జిల్లాల్లో సగటున 11.30 మీటర్ల నుంచి 11.08 మీటర్లకు (22 సెంటీమీటర్లు)కు తగ్గింది. రాష్ట్రంలో సగటున 30 సెంటీమీటర్ల మేర పెరిగి 14.96 మీటర్ల లోతులో ఉన్నాయి.