ఆంధ్రప్రదేశ్‌

విపత్తులను ఎదుర్కొనేందుకు సిద్ధ్దం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దర్శి, సెప్టెంబర్ 17: రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాలను, విపత్తులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గ కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ 75 లక్షల రూపాయలతో నిర్మించిన అగ్నిమాపక కేంద్రాన్ని ఆమె మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాలను, వరదలను, అగ్నిప్రమాదాలను ఎదుర్కొనేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నామన్నారు. రాష్ట్రంలో వరదల నుంచి ప్రజలను సురక్షితంగా చేర్చేందుకు ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ శాఖ పెద్దఎత్తున పని చేస్తోందని తెలిపారు. రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాలు, అగ్ని ప్రమాదాలు జరుగకముందే ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ శాఖను బలోపేతం చేసేందుకు అవసరమైన సిబ్బంది నియామకాలను త్వరలో చేపతతామన్నారు. రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాల విపత్తు నిర్వహణకు, అగ్నిమాపక కేంద్రాల ఏర్పాటుకు ప్రజల నుంచి డిమాండ్ ఉందని తెలిపారు. రాష్ట్రంలోని పాఠశాలల్లో, కళాశాలల్లో అగ్నిప్రమాదాలు జరుగకుండా తనిఖీలు నిర్వహించి ప్రతి మూడేళ్లకు ఒకసారి లైసెన్సులు మంజూరు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో మహిళల రక్షణకు ప్రత్యేకచర్యలు తీసుకున్నామన్నారు. సాంకేతికత పెరిగిన నేపథ్యంలో సైబర్ నేరాలు ఎక్కువయ్యాయని చెప్పారు. రాష్ట్రంలో మహిళలు అత్యవసర పరిస్థితుల్లో రక్షణ కోసం 100, 112, 181 నెంబర్లకు డయల్ చేయాలని తెలిపారు. దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ మాట్లాడుతూ దర్శి నియోజకవర్గంలోని దొనకొండ ప్రాంతం పారిశ్రామిక కారిడార్ గా విస్తరించనున్నందున దొనకొండలో ప్రత్యేకంగా అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేయాలని మంత్రిని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ డైరెక్టర్ ఏఆర్ అనురాధ, డైరెక్టర్ జయరాం నాయక్, ప్రాంతీయ అగ్నిమాపక అధికారి స్వామి, జిల్లా అగ్నిమాపకశాఖ అధికారి శ్రీనివాసరావు, తహశీల్ధార్ అశోక్‌వర్ధన్ తదితరులు పాల్గొన్నారు.

*చిత్రం...అగ్నిమాపక కేంద్రాన్ని ప్రారంభిస్తున్న రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత