ఆంధ్రప్రదేశ్‌

జయసుధకు ‘అభినవ మయూరి’ బిరుదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 17: ప్రముఖ సినీ నటి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ జయసుధకు అభినవ మయూరి బిరుదును ప్రదానం చేశారు. విశాఖలో టి.సుబ్బరామిరెడ్డి లలిత కళాపరిషిత్ ఆధ్వర్యంలో మంగళవారం పోర్టు స్టేడియంలో టీఎస్సార్ జన్మదిన వేడుకులు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకుల్లో భాగంగా ఆమెకు బిరుదు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా టి.సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా నిర్వహించిన జన్మదిన వేడుకుల్లో కళాకారులను సత్కరించడం అభినందనీయమన్నారు. 46 ఏళ్ల పాటు తెలుగు సినిమా రంగంలో 360కి పైగా సినిమాల్లో నటించి సహజ నటిగా పేరు సంపాదించిన జయసుధకు టీఎస్సార్ కళాపీఠం ద్వారా అవార్డు అందించడం ఆనందంగా ఉందన్నారు. ప్రముఖ మత గురువులు, పీఠాధిపతులతో కలసి సర్వధర్మ సంభావణా సమ్మేళన కార్యక్రమం నిర్వహించి వేద పండితుల ఆశ్వీరాదాన్ని టీఎస్సార్ స్వీకరించారు. అనంతరం ప్రముఖ ముక్కామలై పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ శ్రీ్ధర్ స్వామీజీ సుబ్బరామిరెడ్డిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీత డాక్టర్ జయసుధ మాట్లాడుతూ తన సినిమా రంగంలో తొలిసారిగా ఫ్యాన్స్ అసోసియేషన్ స్థాపించిన విశాఖలోనే అభినవ మయూరి బిరుదు పొందడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు, ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, మాగంటి శ్రీనివాస్ రెడ్డి, రఘు రామకృష్ణరాజు, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బరామిరెడ్డి, తెలుగు అధికార భాషా అధ్యక్షుడు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, వీఎంఆర్‌డీఎ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్, ఏపీ ఐఐసీ చైర్మన్ ఆర్కే రోజా, అలనాటి ప్రముఖ సినీ నటీమణులు జమున, జయప్రద, శారదా, రాధిక, శరత్‌కుమార్, జీవిత, రాజశేఖర్, హాస్య నటుడు బ్రహ్మనందం, మురళీమోహన్, గాయకురాలు పి.సుశీల, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
*చిత్రం... ప్రముఖ సినీ నటి జయసుధకు ‘అభినవ మయూరి’ బిరుదు ప్రదానోత్సవంలో స్వర్ణ కంకణం అందించి, వీణను బహూకరించిన టీ ఎస్సార్, అతిథులు