ఆంధ్రప్రదేశ్‌

మహానందిలో 19 సెంటీమీటర్ల వర్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ఉపరితల ద్రోణి కారణంగా రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కర్నూలు జిల్లా మహానందిలో 24 గంటల్లో 19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడం గమనార్హం. సోమవారం ఉదయం 8.30 గంటల నుంచి మంగళవారం ఉదయం 8.30 గంటల వరకూ రాయలసీమ జిల్లాల్లో 9 చోట్ల 10 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైనట్లు ఆర్టీజీఎస్ తెలియచేసింది. కర్నూలు జిల్లా ఆళ్ల గడ్డలో 178 మీల్లీమీటర్లు, బనగానపల్లిలో 66, గోస్పాడులో 163, రుద్రవరంలో 109, నంద్యాల్లో 66, చిరువెళ్లలో 169, ఉయ్యాలవాడలో 86 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కడప జిల్లా ముద్దనూరులో 70, వీరపునాయునిపల్లిలో 68, అనంతపురం జిల్లా బత్తాలపల్లిలో 102, బుక్కపట్నంలో 84, ధర్మవరం 82, కొత్త చెరువులో 78, నార్పలలో 184, సింగనమలలో 133, ప్రకాశం జిల్లా గుడ్లూరులో 74, కదుకూరులో 66, ఒంగోలులో 166, సింగరాయకొండలో 81, టంగుటూరులో 92, ఉలవపాడులో 77, జరుగుమిల్లిలో 69 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.