ఆంధ్రప్రదేశ్‌

బోటును వెలికి తీయడం కష్టమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం : తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరుమందం వద్ద గోదావరి నదిలో మునిగిపోయిన టూరిజం బోటును బయటకు తీయడం అంత సులభం కాదని నిపుణులు అంచనా వేస్తున్నారు. బోటును వెలికితీయడంపై అధికారులు సమాలోచనలు సాగిస్తున్నారు. ఉత్తరాఖండ్ నుంచి వచ్చిన నిపుణులు బోటు ఎంత లోతులో ఉందో అంచనావేసి మంగళవారం అధికారులకు వివరాలు తెలియజేశారు. ఒక ప్రత్యేక పరికరం ద్వారా నీటి అడుగులో వున్న బోటును గుర్తించి బయటకు తీయాల్సివుంది. అధునాతనమైన సైడ్ స్కాన్ సోనార్ పరికరంతో ఎంత లోతులో వున్న బోటునైనా వెతికి పట్టుకోవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. గల్లంతైన వారిలో కొన్ని మృతదేహాలు బోటులో ఉండవచ్చని భావిస్తున్నారు.
ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ ప్రాంతాలకు చెందిన నిపుణుల బృంద బోటు అడుగున భాగానికి వెళ్ళే ప్రయత్నంచేశారు. నీటి అడుగున బురదలో కూరుకుపోయిన బోటును వెలికితీయడానికి అవసరమైన భారీ క్రేన్లు నిలబెట్టేందుకు భౌగోళికంగా ఆ ప్రాంతం అనువుగాలేదు. కొండలను ఒరుసుకుంటో నది సాగే ప్రాంతంలో ప్రమాదం చోటుచేసుకుంది. ఒడ్డు ఏటవాలు ప్రాంతం కావడంతో మరో లాంచీని ఆధారం చేసుకునే వెలికి తీసే ప్రక్రియ కొనసాగించాల్సివుందని తెలుస్తోంది. మరోపక్క ఈ ప్రాంతం మొసళ్లకు ఆవాసమని కూడా చెబుతున్నారు. ప్రమాదానికి గురైన బోటు సుమారు 20 టన్నుల బరువు ఉంటుందని అంచనా. నీటిలో మునిగిన అనంతరం దాని బరువు ఇంతలింతలుగా పెరుగుతుంది. ఇక గోదావరిలో బురదతో నిండిన వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నందున నీటి అడుగున ఉన్న బోటులో బురద భారీగా పేరుకుపోయే అవకాశముంటుందని భావిస్తున్నారు. గోదావరి నదిలో ప్రమాదం జరిగిన చోట మంగళవారం ఉదయం సెకనుకు 21,952 క్యూమెక్సుల ప్రవాహం వెళ్తోంది. దిగువన ఉన్న ధవళేశ్వరం కాటన్ బ్యారేజి నుండి 4.24 లక్షల క్యూసెక్కుల వరద జలాలు సముద్రంలోకి వెళ్తున్నాయి. మంగళవారం ఉదయం భద్రాచలం వద్ద 25.9 అడుగుల నీటి మట్టం నమోదైంది. ఈ ప్రవాహ ఉద్ధృతిలో లాంచీని బయటకు తీయడం అంత సులువుకాదు. అదీ భారీగా సుడులు తిరుగుతున్న ప్రవాహంలో కష్టసాధ్యమనే వాదన వినిపిస్తోంది.ప్రమాదం జరిగిన ప్రాంతం అత్యంత లోతైన ప్రాంతం. దీనికి తోడు ఒకపుడు ఈ ప్రాంతం మొసళ్లకు ఆవాసంగా స్థానికులు చెబుతున్నారు. సుమారు 315 అడుగుల లోతులో లాంచీ వున్నట్టు భావిస్తున్నారు. ప్రస్తుత ప్రవాహంలో ఒక లీటరు నీటిలో ఒక గ్రాము మట్టి చొప్పున 25 లక్షల మెట్రిక్ టన్నుల మట్టి పేరుకుంటుందని ప్రవాహ ప్రమాణాల ప్రకారం లెక్కిస్తున్నారు.
ఉద్ధృతంగా ప్రవహించే గోదావరి నదిలో ఒక ఏడాదికి ఒక హెక్టారు భాగంలో ఒక మిల్లీ మీటర్ మందాన పొర ఏర్పడుంటుంది. దీనిని బట్టి వేగంగా బోటుపై మట్టి పేరుకు పోతుందని తెలుస్తోంది. ఒకవైపు బోటు వెలికితీతపై సమాలోచనలు సాగిస్తూనే ముందు గల్లంతైన వారి ఆచూకీ కోసం గాలింపుచర్యలు విస్తృతంగా కొనసాగిస్తున్నారు. ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలతో పాటు అగ్నిమాపక దళం, గజ ఈతగాళ్లు మృతదేహాల కోసం గాలిస్తున్నారు. తెలంగాణ మంత్రులు యర్రబెల్టి, పువ్వాడ అజయ్‌కుమార్, డీజీపీ గౌతమ్ సవాంగ్, మంత్రి కన్నబాబు, ఎంపీ భరత్, ఎస్పీ నరుూమ్ అస్మీ హెలీకాప్టర్‌లో గాలింపు చర్యలను పర్యవేక్షించారు. బోటు మునిగిన ప్రాంతంలో సుడిగుండాలు ఏర్పడుతుండటంతో గాలింపు చర్యలకు తీవ్ర ప్రతికూలత ఎదురవుతోంది. సుడిగుండాలు, వరద ఉద్ధృతితో సహాయక బోట్లు నిలవలేని పరిస్థితి ఏర్పడుతోంది. నౌకాదళ సిబ్బంది, ఉత్తరాఖండ్, జార్ఖండ్ నుంచి వచ్చిన ప్రత్యేక బృందాలు గాలింపులో పాల్గొంటున్నాయి.
*చిత్రాలు.. రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి వద్ద మృతదేహాలు
* మృతదేహాల గుర్తింపునకు ప్రయత్నిస్తున్న బంధువులు