ఆంధ్రప్రదేశ్‌

ఆమెను ఓదార్చడం ఎవరి తరమూ కావడంలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 16: తూర్పు గోదావరి జిల్లాలో గోదావరిలో పర్యాటక బోటు ప్రమాదం నుండి బయటపడిన తిరుపతికి చెందిన మధులత అనే మహిళను ఓదార్చడం ఎవరి తరమూ కావడంలేదు. తిరుపతికి చెందిన మధులత భర్త, కుమార్తెతో కలిసి ఆదివారం పర్యాటక బోటులో పాపికొండలు యాత్రకు వెళ్లారు. ప్రమాదంలో బోటు మునిగిపోతున్న సమయంలో భర్త ఆమెను పైకి తోసి, తాను నీటిలోకి జారిపోయారు. అలాగే కుమార్తె ఆమె కాళ్లను పట్టుకున్నప్పటికీ, రక్షించలేని నిస్సహయాతలో ఆమె బయటపడింది. తనను రక్షించిన భర్తను, తాను రక్షించుకోలేక కుమార్తెను తలుచుకుంటూ ఆదివారం సాయంత్రం నుండీ ఆమె విలపిస్తున్న తీరు అందరినీ కలిచివేస్తోంది. ‘దేవుడా నన్ను ఎందుకు బతికించావు.. నన్నూ తీసుకుపో’ అంటూ ఆమె చేస్తున్న ఆక్రందనలు చూపరులకు కంటినీరు తెప్పిస్తోంది. కేవలం ఆక్రందనలే కాక, ప్రాణత్యాగానికి సైతం ఆమె పలుమార్లు ప్రయత్నించినట్టు విశ్వసనీయంగా తెలియవచ్చింది. రంపచోడవరం ఆసుపత్రిలో చికిత్స అనంతరం సోమవారం ఆమెను రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, హోం మంత్రి సుచరిత, స్ర్తి, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత, వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు, రంపచోడవరం ఎమ్మెల్యే ధనలక్ష్మి తదితరులు సోమవారం ఆసుపత్రిలో ఆమెను ఓదార్చారు. జరిగిన ప్రమాదాన్ని తలుచుకుని ఆమె కుమిలిపోతున్న తీరు హృదయవిదారకంగావుంది. ‘ఆమె’ను ఓదార్చడం ఎవరి తరమూ కావడంలేదని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు మీడియా వద్ద వ్యాఖ్యానించడం ఈసందర్భంగా ప్రస్తావనార్హం.
*చిత్రం...రమాదంలో మృతిచెందిన వారికి నివాళి అర్పించి,
కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి